- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహితులతో భోజనానికి వచ్చిన దుబాయ్ ప్రిన్స్.. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని పని!
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్‌దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి కారణం అధికారిక ప్రకటన గానీ, అంతర్జాతీయ సమావేశం గానీ కాదు

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్‌దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తూమ్ (Dubai Crown Prince Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum) మరోసారి వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి కారణం అధికారిక ప్రకటన గానీ, అంతర్జాతీయ సమావేశం గానీ కాదు.. ఒక చిన్న సంఘటన, కానీ పెద్ద మనసును చూపించే ఉదాహరణ! రెస్టారెంట్‌లో స్నేహితులతో లంచ్‌కు వెళ్లిన షేక్ హమ్‌దాన్, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఎవరు ఇలాంటి పని చేస్తారు?' అని ఆశ్చర్యపోతూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు, ప్రజలు ఆయన్ను ఫజ్జా (Fazza) (అరబిక్‌లో సాయం చేసేవాడు) అని ఎందుకు పిలుస్తారో ఈ సంఘటన మరోసారి చూపింది. ఇంతకీ విషయం ఏమిటంటే?
అబుదాబీ యువరాజుతో కలిసి షేక్ హమ్‌దాన్ స్థానిక మాల్‌లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ లా మైజాన్ ఏనీ (La Maison Ani)కు వెళ్లారు. ఆయన వెంట కొంతమంది స్నేహితులు, సన్నిహితులు కూడా ఉన్నారు. యువరాజుల రాకను గమనించిన అక్కడున్నవారు ఎంతో సంబరపడ్డారు. అయితే, క్రౌన్ ప్రిన్స్ వారికి మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. అక్కడ భోజనం చేస్తున్న ప్రతి ఒక్కరి బిల్లును ఆయనే చెల్లించారు. ఈ మొత్తం బిల్లు AED 25,000 నుంచి AED 30,000 (, అంటే సుమారు రూ.5.7 లక్షల నుంచి రూ.6.8 లక్షలు) మధ్య ఉండొచ్చు. ఈ విషయాన్ని ఆ సమయంలో రెస్టారెంట్‌లో భోజనానికి వెళ్లిన ఓ మహిళ LovinDubai అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో షేర్ చేసింది.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకుటుంబం తీరు అద్భుతంగా ఉందని కొందరు నెటిజన్లు పేర్కొనగా.. దాతృత్వంలో తండ్రి షేక్ మహమ్మద్ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారని అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. కాగా, షేక్ హమ్‌దాన్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా 2008లో నియమితులయ్యారు. అంతకుముందు 2006 నుంచి 2008 వరకు డిప్యూటీగా కొనసాగారు.






