- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్లుగా తాగి హైదరాబాద్ రోడ్ల మీద ఒంటెపై సవారీ..వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
ఫుల్లుగా తాగితే ఇంట్లో కూర్చోవాలి కానీ కొందరు రోడ్ల మీదకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: ఫుల్లుగా తాగితే ఇంట్లో కూర్చోవాలి కానీ కొందరు రోడ్ల మీదకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగినప్పుడు బైక్ లేదా కార్ నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతామనుకున్నాడో ఏమో కానీ ఓ వ్యక్తి పీకలదాకా తాగి ఒంటెపై కూర్చుని సవారీ చేశాడు. ఈ ఘటన మరెక్కడో జరగలేదు. హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్రామ్ ఉల్లా షా అనే నెటిజన్ ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. వీడియోలో ఒంటెపై కూర్చుకున్న వ్యక్తి ఫుల్లుగా తాగేసి మత్తులో ఊగిపోతున్నాడు. అతడికి పూర్తిగా సోయి లేకుండా పడిపోయేలా ఉన్నాడు.
హైవేపై పక్కనుండే వాహనాలు వెళుతుంటే ఒంటె చాలా స్పీడ్ గా పరిగెత్తుతోంది. దీంతో దానిపై కూర్చున్న వ్యక్తి పడిపోయేలా కనిపించాడు. ఆ ఒంటె ఫ్లైఓవర్ అంచుల నుండి వెళ్లడంతో కిందపడితే ఇక పైకి పోవడమే అన్నట్టుగా కనిపిస్తోంది. దీన్నంతా వీడియో తీసిన నెటిజన్ అతడిని ఆపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతడు ఆగకపోవడంతో చేతిలో ఉన్న బాటిల్ తో నీళ్లు పోశాడు. అయినా ఆగలేదు. దీంతో పక్కన వెళుతున్న వాహనాల వారిని హెచ్చరించి ఒంటెకు అడ్డుగా వెళ్లి దాన్ని ఆపాడు. చివరికి దానిని తాడుతో హైవే పక్కన కట్టేసి అతడిని కిందకి దింపి వాహనాలను పంపించాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అతడివల్ల రోడ్డుపై వెళుతున్న ఇతరులకు సైతం ప్రమాదం జరగవచ్చని మండిపడుతున్నారు.






