మ‌ద్యం మ‌త్తులో రోడ్డుపై ర‌చ్చ రచ్చ చేసిన యువ‌తి.. వీడియో వైర‌ల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-10 09:32:14  IST  )

ఫుల్లుగా మ‌ద్యం తాగి ఓ యువ‌తి రోడ్డుపై ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌తోనే గొడవకు దిగింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.

మ‌ద్యం మ‌త్తులో రోడ్డుపై ర‌చ్చ రచ్చ చేసిన యువ‌తి.. వీడియో వైర‌ల్
X

దిశ, వెబ్ డెస్క్: ఫుల్లుగా మ‌ద్యం తాగి ఓ యువ‌తి రోడ్డుపై ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌తోనే గొడవకు దిగింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. కోబ్రా పట్టణంలోని ONC ప‌బ్ బయట అర్ధ‌రాత్రి మ‌ద్యం మ‌త్తులో కొంద‌రు యువ‌కులు, యువ‌తులు హంగామా సృష్టించారు. ఒక‌రితో ఒకరు గొడ‌వ ప‌డుతూ భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించారు.

ఈ క్ర‌మంలో అక్క‌డ‌కు పోలీసులు చేరుకుని ఇరు వ‌ర్గాల‌ను శాంతిప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు. కాగా ఓ యువతి ఈ క్ర‌మంలో కానిస్టేబుల్ తో గొడ‌వ‌కు దిగింది. నా భ‌ర్త‌ను కొట్టి ప‌డేస్తారా.. చంపి పాతిపెడ‌తారా. అంటూ పోలీసుల‌తో వాగ్వాదానికి దిగింది. ఘ‌ట్టిగా అరుస్తూ పోలీసుల‌ను బూతులు తిట్టింది. కానిస్టేబుల్ ఓపిక‌గా పోలీస్ స్టేష‌న్‌లో రిపోర్ట్ చేయాలని పదండి అని మాట్లాడినప్పటికీ వినకుండి ఆయనపైనే చిందులు వేసింది. ఓ వైపు భారీ వర్షం పడుతుంటే భార్యాభర్తలు ఇద్దరూ అక్కడ నుండి వెళ్లిపోకుండా పోలీసులతో వాదిస్తూనే ఉన్నారు.

Next Story