మద్యం తాగి విమానంలో మహిళ హల్‌చల్.. ప్రయాణికులందరినీ దించాల్సిన పరిస్థితి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-15 05:02:23  IST  )

మద్యం మత్తులో కొందరు వ్యక్తులు వింత వింత ప్రవర్తించటం చూస్తూనే ఉంటాం.

మద్యం తాగి విమానంలో మహిళ హల్‌చల్..  ప్రయాణికులందరినీ దించాల్సిన పరిస్థితి
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో కొందరు వ్యక్తులు వింత వింత ప్రవర్తించటం చూస్తూనే ఉంటాం. చూట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయి డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ కనిపిస్తే, మరికొందరు పక్కవారిని ఇబ్బందిపెడుతూ రచ్చ సృష్టిస్తుంటారు. ఇలాంటి ఓ సంఘటననే అమెరికాలోని (America) డెల్టా ఎయిర్‌లైన్స్ (Delta Airlines) విమానంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ మహిళ చేసిన హడావుడికి ఏకంగా విమానంలోని ప్రయాణికుందరినీ దించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏప్రిల్ 14న డల్లాస్ నుంచి బోస్టన్ (Dallas to Boston) వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో అలీషియా అనే మహిళ మద్యం మత్తులో హడావుడి చేసి తీవ్ర కలకలం రేపింది. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తుండటంతో ఆమెను విమానం నుంచి దించేందుకు అధికారులెంతగానో ప్రయత్నించారు. అయితే, బాడీక్యామ్ వీడియోలోని దృశ్యాలు తాజాగా ఈ ఘటనకు సంబంధించిన కొత్త కోణాలను బయటపెట్టింది.

మహిళ విమానం బయలుదేరే ముందు ఎయిర్‌పోర్ట్‌లో ఆరు గ్లాసుల వైన్ తాగినట్టు చెప్పారు. అంతేకాక, విమానంలో కూడా ఆమె ఒక గ్లాస్ ప్రొసెకో, రెండు టకిలా షాట్స్ తాగిందని ఫ్లైట్ అటెండెంట్ పోలీసులకు వివరించారు. పోలీసుల ఎన్నో హెచ్చరికల తర్వాత కూడా అలీషియా విమానం దిగి వెళ్లేందుకు నిరాకరించడంతో చివరికి విమానంలోని మిగతా ప్రయాణికులందరినీ దించాల్సి వచ్చింది. ఆమెను బలవంతంగా బయటకు తీసుకెళ్లి, అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆమె మాట్లాడుతూ 'మీరు నా ఒక్కే ఒక్క వార్నింగ్ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు అలా చేశారు?' అని ప్రశ్నించింది. పోలీస్ వాహనంలో ఆమె తన్నటం, గట్టిగా శ్వాస తీసుకోవడం, సిగరెట్ అడగడం వంటి ప్రవర్తన చూపింది. పోలీస్ స్టేషన్‌లో కూడా ఎదురుదాడి చేయడం, ఆదేశాలను పాటించకపోవడం వంటి ప్రవర్తనను కొనసాగించింది. దీంతో ఆమెపై పోలీసులు 'క్రిమినల్ ట్రెస్పాసింగ్', 'పబ్లిక్ ఇంటాక్సికేషన్' ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మద్యం మత్తులో చేసే అవాస్తవ ప్రవర్తన ఎలాంటి తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుందో మరోసారి రుజువు చేసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story