- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎనీ టైం ఎనీ సెంటర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. గిలిగింతలు పెట్టిస్తున్న మందుబాబు వీడియో
హైదరాబాద్ జంట నగరాల్లో పోలీసులు నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ జంట నగరాల్లో పోలీసులు నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. దీంతో నగరంలో పోలీసులు షాక్ తినే ఘటనలు ఎదురవుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లోనూ మందుబాబులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంత ఉదయాన్నే ఎలా తాగారని ప్రశ్నిస్తే.. మీకు కాఫీ, టీలు ఎలాగో మాకు మందు అలాగా.. అంటూ షాకింగ్ ట్విస్టులు ఇస్తున్నారు. అయినా పోలీసులుమందుబాబులను ఎక్కడికక్కడ పట్టెస్తున్నారు. ఈ టెస్టుల్లో స్కూల్ బస్ డ్రైవర్లు, మున్సిపల్ చెత్త బండ్ల డ్రైవర్లు ఎక్కువగా పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తుందని పోలీసులు ఆవేదన చెందుతున్నారు.
ఇక ఓ మందుబాబు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం.. ఓ వ్యక్తి కారులో వస్తుండగా.. పోలీసులకు చిక్కాడు. బ్రీత్ ఎనలైజర్ పెట్టి ఊదమనగా.. వింత వింత విన్యాసాలకు పాల్పడ్డాడు. గాలిని లోపలికి గుంజుకోవడం.. బ్రీత్ ఎనలైజర్ పైపును కొరికేయడం.. నోరు తెరిచి కోతి చేష్టాలకు పాల్పడుతూ పోలీసులను సైతం నవ్వించాడు. అయ్యా.. అయ్యా.. ఏంటయ్య ఇది.. ఈ దౌర్జన్యం ఏంటని తడపడుతూ అనడం అందరినీ నవ్వించింది. చివరికి అతడి నుంచి శ్వాస పరీక్షలు నిర్వహించిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో పాతదే అయినా.. పోలీసులు ఎనీ టైం.. ఎనీ సెంటర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుండటంలో మళ్లీ వైరల్‌గా మారింది.






