- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓరయ్య అది పిల్లి కాదురా పెద్దపులి.. బెంగాల్ టైగర్‌కు మద్యం తాగించబోయిన మందుబాబు(వీడియో)
మధ్యప్రదేశ్ పెంచ్‌లో బెంగాల్ టైగర్‌కు లిక్కర్ తాగించాడు ఓ కార్మికుడు. అవును.. పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న పులిని మధ్యరాత్రి తాగిన మత్తులో ఉన్న 52ఏళ్ల కార్మికుడు రాజు

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ పెంచ్‌లో బెంగాల్ టైగర్‌కు లిక్కర్ తాగించాడు ఓ కార్మికుడు. అవును.. పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న పులిని మధ్యరాత్రి తాగిన మత్తులో ఉన్న 52ఏళ్ల కార్మికుడు రాజు పటేల్ చూశాడు. కానీ దాన్ని పిల్లి అనుకుని.. దగ్గరకు తీసుకుని లిక్కర్ తాగించబోయాడు. దాని తల నిమురుతూ పది నిమిషాలపాటు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాన్ని అడవికి తీసుకెళ్లారని.. ఓ స్టోరీ ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం అతను పోలీసుల ప్రొటెక్షన్‌లో ఉన్నాడని.. సోషల్ మీడియా ఎకౌంట్ బ్లాక్ చేశాడని తెలుస్తోంది. కారణం పులితో ముచ్చటించిన అతను తాగిన లిక్కర్ గురించి తెలుసుకునేందుకు స్థానికులు పోటీ పడుతున్నారని.. అందుకే పోలీసుల బందోబస్తు ఉందన్న ఫన్నీ వార్త వైరల్ అవుతోంది. 24 గంటల్లో లక్షల కొద్ది వ్యూస్, లైక్స్ సొంతం చేసుకున్న వీడియో.. ఏఐ జనరేటెడ్ కాగా స్టోరీకి రెస్పాన్స్ అదిరిపోయింది.






