నా చెవులు పోయాయి, ఎయిర్ పాడ్స్ చెత్తలో పడేయండి.. యువతి షాకింగ్ వీడియో!

by Ajay Maddhiboyina |

ఎయిర్ పాడ్స్ వాడటం వల్ల తన వినికిశక్తి తగ్గిపోయిందని ఓ యువతి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొద్దిరోజులుగా ఎయిర్ పాడ్స్ వినియోగించడం వల్ల తన ఒక చెవిలో 20 శాతం, మరో చెవిలో 35శాతం వినికిడిశక్తి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

నా చెవులు పోయాయి, ఎయిర్ పాడ్స్ చెత్తలో పడేయండి.. యువతి షాకింగ్ వీడియో!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎయిర్ పాడ్స్ వాడటం వల్ల తన వినికిశక్తి తగ్గిపోయిందని ఓ యువతి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొద్దిరోజులుగా ఎయిర్ పాడ్స్ వినియోగించడం వల్ల తన ఒక చెవిలో 20 శాతం, మరో చెవిలో 35శాతం వినికిడిశక్తి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎయిర్ పాడ్స్‌లో ఉండే నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ వల్ల తన చెవిలోని సున్నితమైన నరాలు పనిచేయకుండా పోయాయని చెప్పింది. దానికి ఎలాంటి చికిత్స లేదని, జీవితాంతం ఇదే సమస్యతో బాధపడాలని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఎక్కువశబ్దంతో గంటల పాటు ఎయిర్ పాడ్స్ పెట్టుకునేవారికి ఖచ్చితంగా ఈ సమస్య ఎదురవుతుందని హెచ్చరించింది.

అవసరైనప్పుడు వైర్ ఇయర్ ఫోన్స్ వాడాలని, అది కూడా తక్కువగా వాడాలని సూచించింది. కానీ ఇయర్ పాడ్స్ వాడితే వినికిడి సమస్య వస్తుందని కాబట్టి వాటిని వెంటనే పక్కన పడేయాలని చెప్పింది. అనవసరంగా ఎయిర్ పాడ్స్ వాడి చెవులను పాడు చేసుకోవద్దని, తాను ఎంతో బాధపడుతున్నానని తెలిపింది. మరెవరికీ ఇలాంటి సమస్య రావద్దని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఎయిర్ పాడ్స్ ఎక్కువగా వాడటం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది. 80 డెసిబల్స్ శబ్దానికి మించకుండా వారానికి 40 గంటల వరకు రిస్క్ లేకుండా వినవచ్చని చెబుతోంది. అంతే కాకుండా మధ్యలో బ్రేక్ తీసుకోవాలని సూచించింది. video

Next Story