Viral video:'నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు బ్రో'.. బాత్రూమ్ వెళ్లిన వ్యక్తి ఏం జరిగిందంటే?

by Yella Dhawani Reddy |

సాధారణంగా చెట్ల పొదలు ఎక్కువగా ఉండే చోట పాములు (Snacks) సంచరిస్తుంటాయని తెలుసు.

Viral video:నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు బ్రో.. బాత్రూమ్ వెళ్లిన వ్యక్తి ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చెట్ల పొదలు ఎక్కువగా ఉండే చోట పాములు (Snacks) సంచరిస్తుంటాయని తెలుసు. కొన్ని కొన్ని సార్లు ఇవి జనవాసాల్లోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి కూడా. అయితే, ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. వేడి తాపం నుంచి రక్షించుకునేందుకు ఎక్కడైతే చల్లగా ఉంటుందో అలాంటి ప్రదేశాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిడ్జిల్లో పాములు ప్రవేశించిన వార్తలు సోషల్ మీడియాలో అనేకం చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఓ వార్త నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

పాములంటే భయపడని వారుండరు. ఇదిగో పాము అంటే.. అదిగో అంటూ పరుగుపెడతారు. అలాంటిది.. బాత్రూమ్‌లో ఉండగా పాము ప్రవేశిస్తే.. ఊహించుకుంటుంటేనే భయమేస్తుంది కదా. కానీ, ఓ వ్యక్తి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఓ వ్యక్తి తమ ఇంటి బయట ఉన్న బాత్రూంలోకి వెళ్లాడు. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికే ఆ బాత్రూమ్ డోర్‌కి కింద ఉన్న సందులోంచి ఓ నాగుపాము ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ వ్యక్తిని చూసి అది బయటకు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ లోపలికి వచ్చి పడగవిప్పింది. ఆ వ్యక్తి 'రామ్.. రామ్' అంటూ గట్టిగా కేకలు పెట్టడం ప్రారంభించగా, పాము మాత్రం బుసలు కొడుతూ పక్కనే ఉన్న ఓ మూలన నక్కింది. దీంతో ఆ వ్యక్తి జాగ్రత్తగా బాత్రూమ్ డోర్ తీసుకుని పరిగెత్తాడు. అయితే, ఆ వ్యక్తి బాత్రూమ్‌లోకి మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లటంతో ఇదంతా వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు బ్రో' అంటూ 'వామ్మో నాకు అయితే అలా దాన్ని చూడగానే గుండె ఆగిపోయేది' అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story