- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: కేరళలో షాకింగ్ ఘటన.. వీధి కుక్కలపై నాటకం వేస్తుండగా కరిచిన కుక్క
కేరళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడులపై అవగాహన నాటకం ప్రదర్శిస్తున్న సమయంలోనే ఓ కళాకారుడిని కుక్క కరిచింది. రాధాకృష్ణన్ అనే వ్యక్తి వీధి తన టీంతో కలిసి వీధి కుక్కలు కరవడానికి వస్తే ఎలా తప్పించుకోవాలి, క

దిశ, వెబ్ డెస్క్: కేరళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడులపై అవగాహన నాటకం ప్రదర్శిస్తున్న సమయంలోనే ఓ కళాకారుడిని కుక్క కరిచింది. రాధాకృష్ణన్ అనే వ్యక్తి వీధి తన టీంతో కలిసి వీధి కుక్కలు కరవడానికి వస్తే ఎలా తప్పించుకోవాలి, కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని నాటకం వేశాడు. కాగా నాటకం మధ్యలోనే అక్కడకు వచ్చిన ఓ కుక్క అతడిని కరిచింది. అయినప్పటికీ అతడు ఆగలేదు. నాటకాన్ని కొనసాగించాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమ గురించే నాటకం వేశాడని ఆ కుక్కకు తెలిసిపోయిందేమో అందుకే కరిచింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, మరో నెటిజన్ ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అంటూ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. ఇదిలా ఉంటే దేశంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఫన్నీగా ఉన్నా నిజానికి సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కొంతమందికి అయినా కుక్కల నుండి ఎలా రక్షించుకోవాలో అర్థం అవుతుంది. video






