- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking video: బాలుడితో సిగరెట్ తాగించిన వైద్యుడు.. షాకింగ్ వీడియో వైరల్
మద్యపానం (drinking), ధూమపానం (smoking) ఆరోగ్యానికి హానికరం అంటూ టీవీలలో, థియేటర్‌లలో హెచ్చరిస్తుంటారు.

దిశ, ఫీచర్స్: మద్యపానం (drinking), ధూమపానం (smoking) ఆరోగ్యానికి హానికరం అంటూ టీవీలలో, థియేటర్‌లలో హెచ్చరిస్తుంటారు. అంతే కాకుండా.. సిగరెట్ కాల్చడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, మరణం వంటి ప్రమాదాలు ఏర్పడతాయని, ముఖ్యంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి ఎటాక్ అవుతాయాని ప్రతి వైద్యుడు చెప్తాడు. మరి అలాంటి వైద్యుడే దగ్గరుండి సిగరెట్ తాగిస్తే.. అది కూడా ముక్కుపచ్చలారని ఓ చిన్న బాలుడికి తాగిస్తే ఏం అంటారు. అవును.. మీరు విన్నది నిజమే. ఇలాంటి షాగింగ్ ఘటనే యూపీలో జరిగింది.
జలుబుతో బాధపడుతున్న ఓ చిన్న బాలుడితో డాక్టర్ సిగరెట్ తాగించిన ఘటన యూపీ(UP)లోని జలౌన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ ఐదేళ్ల బాలుడు జలుబుతో బాధపడుతుండగా.. బాలుడిని తల్లిదండ్రులు సురేశ్ అనే వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. అతను వైద్యం చేయకపోగా బాలుడితో సిగరెట్ (cigarette) తాగించారు. పొగ పీలిస్తే జలుబు తగ్గిపోతుందని డాక్టర్ చెప్పడం గమనార్హం. ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబు వస్తే వైద్యుడికి చూపించగా.. మందులు, ఇన్‌జక్షన్ ఇస్తాడు డాక్టర్. అయితే ఈ డాక్టర్ మాత్రం సిగరెట్ కాల్చమని సలహా ఇవ్వడంతో పాటు దగ్గరుండి మారి తాగించడం ఈ షాకింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






