ఏ మంత్రితో చెప్పుకుంటావో చెప్పుకో.. విధుల్లో తప్పతాగి డాక్టర్ రచ్చ

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-31 13:37:47  IST  )

రాజస్థాన్ బీకేనీర్ జిల్లా బజ్జు తహిశీల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో దీపావళి రోజున డాక్టర్ వీరంగం సృష్టించాడు. పండుగ కావడంతో డాక్టర్ శైలేంద్ర సింగ్ ఒక్కడే డ్యూటీలో ఉన్నాడు

ఏ మంత్రితో చెప్పుకుంటావో చెప్పుకో.. విధుల్లో తప్పతాగి డాక్టర్ రచ్చ
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ బీకేనీర్ జిల్లా బజ్జు తహిశీల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో దీపావళి రోజున డాక్టర్ వీరంగం సృష్టించాడు. పండుగ కావడంతో డాక్టర్ శైలేంద్ర సింగ్ ఒక్కడే డ్యూటీలో ఉన్నాడు. అయితే తమ పిల్లలను చికిత్సకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. ట్రీట్మెంట్ కోసం ఎంత వెయిట్ చేసినా స్పందించలేదు. విషయమేంటని లోపలికి వెళ్తే హాయిగా రెండు మద్యం బాటిళ్లు ఖాళీ చేసి పడుకున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇష్టమున్న చోట చెప్పుకో అంటూ రెచ్చిపోయాడు. కాగా డాక్టర్ సింగ్ ఇంతకు ముందు భరత్ పూర్ జిల్లా CMHOగా పని చేశాడు. అక్కడ సరైన ప్రవర్తన లేకపోవడంతో బీకేనీర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయబడ్డాడు. ఇక్కడ కూడా అదే తంతు కొనసాగిస్తున్నాడు. ఇక బజ్జు సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో 18 పోస్టులు ఉండగా.. కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

Next Story