- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయిన డాక్టర్సె.. సెలైన్ ఎక్కించుకుంటూ మరీ సర్జరీ కంటిన్యూ
వైద్యోనారాయణ హరి అని డాక్టర్లను కొనియాడుతూ ఉంటారు. అంటే పోయే ప్రాణాలను కూడా తెచ్చి నిలబెట్టడం వారి చేతుల్లో ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : వైద్యోనారాయణ హరి అని డాక్టర్లను కొనియాడుతూ ఉంటారు. అంటే పోయే ప్రాణాలను కూడా తెచ్చి నిలబెట్టడం వారి చేతుల్లో ఉంటుంది. వైద్యులకు సెలవులు గాని, వారికి అనారోగ్యంగా ఉన్నా సరే వైద్యం చేయడం మానరు. అయితే తానా ఆరోగ్యం బాగాలేకపోయిన ఓ వైద్యుడు చేసిన సాహసానికి సెల్యూట్ కొట్టకుండా ఉండలేరు. టర్కీలోని బర్సా ఉళుదాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ ఒగుజ్ బసత్ ఒక పేషేంట్ కు లాలాజల గ్రంథుల్లో ఉన్న గడ్డలను తొలగించే ఆపరేషన్ చేపట్టారు.
అయితే ముందురోజే ఆ డాక్టర్ ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కానీ పేషేంట్ పరిస్థితి విషమించడంతో బసిత్ సర్జరీ చేయక తప్పలేదు. అయితే ఆపరేషన్ మధ్యలో రక్తపోటు బాగా పెరిగి బసిత్ కళ్ళు తిరిగి పడిపోయారు. తోటి వైద్యులు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించగా కాసేపటికి రక్తపోటు సాధారణ స్థితికి వచ్చింది. అయితే తన చేతికి ఉన్న ఐవీ ఫ్లూయిడ్స్ ను కాలికి మార్చుకొని మరీ సర్జరీని పూర్తీ చేసాడు ఆ డాక్టర్. ఇది అతి ముఖ్యమైన సర్జరీ కావడం వలన పేషేంట్ ప్రాణాలను అలా వదిలేయాలని అనుకోలేదని బసిత్ వెల్లడించాడు.
కాగా అతను IVతో కూర్చొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై వర్శిటీ అధికారులు బసిత్ ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే అందరూ తనను పొగడటంపై బసిత్ స్పందిస్తూ.. నా కర్తవ్యమ్ నేను నిర్వర్తించాను, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు.






