ఐదు రోజులు అసలు కూర్చోకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

by Yella Dhawani Reddy |

యూట్యూబ్‌లో (Youtube) మనం నిత్యం ఎన్నో రకాల వీడియోలు (Videos) చూస్తుంటాం.

ఐదు రోజులు అసలు కూర్చోకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబ్‌లో (Youtube) మనం నిత్యం ఎన్నో రకాల వీడియోలు (Videos) చూస్తుంటాం. కామెడీ, ట్రావెల్ వ్లాగ్స్, గేమింగ్, కుకింగ్.. అనేక రకాల వీడియోలను వీక్షిస్తాం. అయితే, వాటిల్లో ప్రత్యేక ఆకర్షణగా ఛాలెంజింగ్ వీడియోలు (Challenging videos) నిలుస్తాయి. వీటిలో యూట్యూబర్లు ఓ ప్రత్యేకమైన పరీక్షగా అనిపించే వాటిని చేస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తాజాగా లూకాస్ బాల్ అనే యూట్యబర్ కూడా ఓ వినూత్న ఛాలెంజ్‌ను స్వీకరించాడు.

లూకాస్ బాల్ పిగ్మీ (Pigmie) అనే యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో వైద్యులు రోజులో 2-3 గంటలు నిలబడి ఉండాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాల్ తన సెడెంటరీ లైఫ్ స్టైల్ (sedentary lifestyle)‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే, వైద్యులు సూచనల ప్రకారం కాకుండా రోజంతా నిలబడి ఉండే ఛాలెంజ్‌ను స్వీకరించాడు. ఇందుకోసం తన వర్క్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి బాల్ స్టాండింగ్ డెస్క్ సైతం కొనుగోలు చేశాడు.

మూడు రోజులు విజయవంతంగా ఛాలెంజ్‌ను పూర్తి చేసిన బాల్.. తర్వాత నుంచి అసలు కష్టం ప్రారంభమైంది. కాళ్లు, పాదాలు, కీళ్లలో నొప్పులు రావటం, నిద్ర పట్టక పోవటం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో తన ఛాలెంజ్‌ను విరమించుకోవాలనుకున్నాడు. ఐదు రోజుల తర్వాత తన ప్రయోగానికి స్వస్తి చెప్పాడు. అయితే, దీని వల్ల తను లాభా నష్టాలు రెండు తెలుసుకున్నట్లు వెల్లడించాడు. తన జీర్ణక్రియ మెరుగుపడిందని, ఏకాగ్రత పెరిగి 30% ఉత్పాదక పెరిగినట్లు చెప్పాడు. అయితే పొద్దంతా తినడం వల్ల ఒక కిలో బరువు కూడా పెరిగిందని తెలిపాడు. ఈ ప్రయోగం ద్వారా తను రోజు కొంత సమయం నిల్చుండే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు.

Next Story