- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Japan Sumo Wrestlers: ఆటోగ్రాఫ్‌లు ఇలా కూడా ఇస్తారా?
సాధారణంగా అభిమానులు తమ ఫేవరేట్ హీరోలు, క్రికెటర్లు, పొలిటికల్ లీడర్స్ తదితర సెలబెట్రీల ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఆరాటపడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా అభిమానులు తమ ఫేవరేట్ హీరోలు, క్రికెటర్లు, పొలిటికల్ లీడర్స్ తదితర సెలబెట్రీల ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఆరాటపడుతుంటారు. సెలబెట్రీలు కూడా తమ ఫ్యాన్స్ ఎవరైనా ఎదురుపడి ఆటోగ్రాఫ్ అడిగితే వెంటనే పెన్ను తీసి తమదైన స్టైల్లో సిగ్నేచర్ పెడుతారు. ఇది మనందరికి తెలిసిందే. అయితే, జపాన్‌లో (Japan) మాత్రం ఓ వింత సంప్రదాయం ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
జపనీయులు కుంగ్ ఫూ క్రీడకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆ దేశంలో సుమో రెజ్లర్లకు (Japan sumo wrestlers) ఉండే ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దేశంలో సుమో రెజర్లు తమ అభిమానులకు ఓ పేపరుపై చేతి ముద్రలను వేసి ఆటోగ్రాఫ్‌లను (Autograph) అందిస్తుంటారు. ఇందు కోసం ఎరుపు లేదా నలుపు రంగు సిరాను వినియోగిస్తారు. దీనిని 'టెగాటా (Tegata)' సంప్రదాయంగా జపనీయులు పిలుస్తారు. ఈ టెగాటా సంపద్రాయానికి రెజర్లు ఎంతో విలువ ఇస్తారు. అలాగే, ఈ రకమైన ఆటోగ్రాఫ్‌లను అందరూ సుమో రెజర్లు ఇవ్వడానికి వీలులేదు. కేవలం అగ్రస్థానంలో ఉన్నవారు ఇచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతేకాదు, ఈ టెగాటాను జపనీయులు చాలా విలువైనా, అరుదైనా వస్తువుగా భావిస్తారు.






