అవునా.. జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయా?.. అసలు విషయం ఇదే!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-21 11:05:59  IST  )

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య(suicide)లు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

అవునా.. జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయా?.. అసలు విషయం ఇదే!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య(suicide)లు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆత్మహత్య అనేది వారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆనందం, విషాదం, డిప్రెషన్, ఒత్తిడి మొదలైన భావోద్వేగాలు మానవులందరిలో ఉండే సహజ లక్షణాలు. అయితే అవి సమయాన్ని బట్టి బయటకు వస్తుంటాయి. ఏదైనా మితిమీరితే ప్రమాదమే అన్నట్లు.. అతిగా ఆలోచించడం వల్ల కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్మ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనుషులే కాదు.. జంతువులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటాయి? అనే వార్త ప్రజెంట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అసలు విషయంలోకి వెళితే.. సాధారణంగా మనుషుల వలె జంతువులు(Animals) కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాయని చెప్పలేం. అయితే జంతువులకు మానవుల మాదిరిగా జీవితం గురించి, మరణం గురించి లోతైన అవగాహన ఉంటుందని చెప్పడానికి ఆధారాలు కూడా చాలా తక్కువ. కానీ.. కొన్ని కొన్ని సందర్భాల్లో జంతువులు వింతగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి సమయాల్లో వాటి ప్రవర్తన చూస్తే ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, బాధ పడుతున్నప్పుడు జంతువులు తమను తాము దాచుకోవడం. ఈ క్రమంలో కొత్త పరిసరాలకి వెళ్లినప్పుడు కూడా జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తాయి, ఇక ప్రమాదాలు లేదా ఇతర జంతువుల భయం వల్ల కూడా జంతువుల బిహేవియర్ అసాధారణంగా ఉంటుందంట.

అయితే "డాగ్ సూసైడ్ బ్రిడ్జి" వంటి ప్రదేశాల్లో అనేక కుక్కలు దూకి మరణించినట్లు కథనాలు వచ్చాయి. కానీ ఈ ఘటనలకు అనేక కారణాలు ఉండవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే.. బ్రిడ్జి యొక్క నిర్మాణం, పరిసరాల పట్ల శునకాలకు శిక్షణ లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా.. మానవుల మాదిరిగానే జంతువులను కూడా వాటి ప్రవర్తన ఆధారంగా అర్థం చేసుకోవడం కష్టమే. వాటికి భాష లేదు, తమ భావాలను తెలియజేయలేవు. కాబట్టి జంతువుల ప్రవర్తన గురించి తీర్మానాలకు వచ్చే ముందు క్షుణ్ణంగా పరిశీలించి.. జీవశాస్త్రం, పరిసరాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయనే దానికి నిర్ధారణైన, కచ్చితమైన సాక్ష్యాలు లేవు. అయితే.. కొన్ని సందర్భాల్లో వాటి ప్రవర్తన ఆత్మహత్యాయత్నంగా అనిపించవచ్చు. కానీ అందులో వాస్తవం లేదు.. కాబట్టి ‘జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయా’ అన్న అంశంపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

నోట్: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించింది మాత్రమే.

Next Story