- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యతో విడాకులు.. కదిలే రైలులో నిప్పు పెట్టిన వ్యక్తి
భార్యతో విడాకులు (Divorce) తీసుకున్న ఓ వ్యక్తి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: భార్యతో విడాకులు (Divorce) తీసుకున్న ఓ వ్యక్తి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డాడు. కదులుతున్న రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రయాణికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. ఈ షాకింగ్ సంఘటన సౌత్ కొరియాలోని (South Korea) సోల్ నగరంలో మే 31న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. సౌత్ కొరియాలోని సోల్ నగరానికి చెందిన 67 ఏళ్ల వాన్ అనే వ్యక్తి, తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ పరిణామం అతడి మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపింది.
ఈ క్రమంలో మే 31న ఉదయం 8:40 సమయంలో సోల్ సబ్‌వే (Seoul Subway) లైన్ 5లో పెట్రోల్ బాటిల్‌తో రైలు ఎక్కాడు. రైలు బయలుదేరి వేగంగా ముందుకెళ్తుండగానే ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న పెట్రోల్ రైలులో పోసి నిప్పంటించాడు. రైలు అప్పటికే మపో స్టేషన్ దాటి యోదయునారూ స్టేషన్ వైపు వేగంగా వెళ్తోంది. ఈ షాకింగ్ ఘటనకు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై రైలు బోగీల్లో పరుగులు తీశారు. తలుపుల్ని తన్నుకుంటూ బయటపడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి మంటలతో గాయాలు కాగా, మరికొంతమంది పొగ వలన అస్వస్థతకు గురయ్యారు. సుమారు 160–400 మంది ప్రయాణికులు ఉన్న ఈ ట్రైన్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడమే అదృష్టకరంగా భావించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైలులోని సీసీటీవీల్లో రికార్డు అవ్వటంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు.






