- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video : విడాకుల కేసులో ఓడిపోయిన భర్త.. ఆగ్రహంతో మెట్రో రైలుకు నిప్పంటించడంతో.. 22 మంది మంటల్లోనే..
సౌత్ కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విడాకుల కేసులో ఓడిపోయిన భర్త నిరాశ, ఆగ్రహంతో మెట్రో రైలుకు నిప్పంటించాడు. మే 31న ఈ ఘటన జరగ్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : సౌత్ కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విడాకుల కేసులో ఓడిపోయిన భర్త నిరాశ, ఆగ్రహంతో మెట్రో రైలుకు నిప్పంటించాడు. మే 31న ఈ ఘటన జరగ్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియాలో ఇలాంటిది జరిగితే ఏంటన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళ్తే.. 67ఏళ్ల వోన్ అనే వ్యక్తి భార్యతో విడాకుల కేసులో ఓడిపోయాడు. భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి రావడంతో విసిగిపోయాడు. ఆగ్రహంతో సియోల్ సబ్ వే లైన్ 5లో నడుస్తున్న మెట్రో రైలు నేలపై పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు జనాలు. దాదాపు 160మందికిపైగా ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకోగా.. 22 మంది మంటల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. ప్రాణ నష్టం తప్పినా ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది.
Next Story






