మీకు ఈ విషయం తెలుసా.. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా పాములు విషం చిమ్ముతాయి!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-03 09:16:24  IST  )

పాములంటే భయపడని వారుండరు.

మీకు ఈ విషయం తెలుసా.. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా పాములు విషం చిమ్ముతాయి!
X

దిశ, వెబ్ డెస్క్: పాములంటే (Snakes) భయపడని వారుండరు. చిన్నా, పెద్దా ఎవరైనా సరే పాము కనిపించిందంటే చాలు.. ఆమడ దూరం పరుగెడుతారు. ఇక పాములు వాటికి మనం ఆపద కల్గిస్తామని భయంతో కాటు వేస్తాయి. కొన్నిసార్లు అవి ఉన్న ప్రదేశాలకు మనం అనుకొకుండా వెళ్లిన కూడా పాము కాటుకు గురవుతుంటాం. ఇలా ఏటా పాము కాటుతో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది చనిపోతున్నారు. అందుకే అది ఎక్కడ కనిపించినా వెంటనే చంపేస్తారు. ఎందుకంటే.. పాము చనిపోతే కాటు వేయలేదు, విషం (Poisonous Snakes) కూడా నాశనమవుతుందని అంతా అనుకుంటారు. కానీ, ఇక్కడే తప్పక తెలుసుకోవాల్సి విషయం ఏమిటంటే.. పాము చనిపోయిన తర్వాత కూడా విషాన్ని చిమ్మగలదని తాజాగా పలు నివేదికల్లో వెల్లడైంది.

సాధారణంగా పాములకు విషం వాటి గ్రంథుల్లో ఉంటుంది. ఆ విష గ్రంథి వాటి తల దగ్గర ఉంటుంది. ఇక పాము చనిపోయిన కొన్ని గంటల వరకు ఆ గ్రంథుల్లో విషం అలాగే ఉంటుందని నివేదికలో తేలింది. ఈక్రమంలో చనిపోయిన పాము కోరపై ఎవరైనా పొరపాటున కాలు వేస్తే, తలపై గట్టిగా కొడితే.. అందులోని విషం బయటికి వచ్చి వారికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందుకే పాము బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయాక కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పాము కాటు గురైన వ్యక్తులు.. విషపూరిత పాములు కాటు వేసిన, విషం లేని పాములు కాటు వేసిన వెంటనే వైద్యులను సంప్రదించాలిని సూచిస్తున్నారు.

Next Story