Deepthi Sharma: పోలీస్ యునిఫాంలో క్రికెటర్ దీప్తి శర్మ.. ఏకంగా ఆ పదవిని కట్టబెట్టిన యూపీ సర్కార్

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-30 09:03:07  IST  )

భారత మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepthi Sharma) పోలీస్ యూనిఫాంలో తళుక్కున మెరిసింది.

Deepthi Sharma: పోలీస్ యునిఫాంలో క్రికెటర్ దీప్తి శర్మ.. ఏకంగా ఆ పదవిని కట్టబెట్టిన యూపీ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepthi Sharma) పోలీస్ యూనిఫాంలో తళుక్కున మెరిసింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ఏకంగా దీప్తిని డీసీపీ (Deputy Superintendent of Police)గా నియమించింది. ఈ జనవరి 27న యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు డీఎస్పీగా దీప్తి శర్మను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదే విష‌యాన్ని దీప్తి శర్మ ఇవాళ త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌‌ (Instagram)లో వెల్లడించింది. ఈ సంద‌ర్భంగా తనకు డీఎస్పీ (DSP)గా ఉద్యోగం ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాని (Uttar Pradesh Government)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఫొటోల‌ను షేర్ చేసింది.

అయితే అందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. ‘ఈ మైలురాయిని సాధించినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది. డీఎస్‌పీ పోస్టు (DSP Post)తో నా చిన్న నాటి క‌ల నెర‌వేరింది. అన్ని విధాల నాకు తోడ్పాటును అందించిన‌ నా కుటుంబానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి అచంచలమైన మద్దతు, ఆశీర్వాదాలు ఈ రోజు న‌న్ను ఈ స్థాయికి చేర్చాయి. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డీఎస్‌పీగా నా విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని హామీ ఇస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన‌ అందరికీ ధన్యవాదాలు’ అంటూ దీప్తి శర్మ త‌న‌ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది.

కాగా, భారత మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో స్పిన్ ఆల్‌రౌండ‌ర్ అయిన దీప్తి శ‌ర్మ (Deepthi Sharma) గ‌తేడాది వ‌న్డే, టీ20 ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసింది. వ‌న్డేల్లో టాప్ వికెట్ టేకర్‌గా గ‌తేడాదిని ముగించిన ఆమె.. టీ20లో ఏకంగా 30 వికెట్లను పడగొట్టింది. ప్రస్తుతం దీప్తి శర్మ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) కోసం సన్నద్ధం అవుతోంది. సమీపిస్తుండటంతో దానికోసం సిద్ధమ‌వుతోంది. అదేవిధంగా 2024లో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత తెలంగాణ సర్కార్ (Telangana Government) హైద‌రాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ (Mahammad Siraj)ను డీఎస్పీగా నియమించిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు దీప్తి శర్మ ఇటీవలి కాలంలో ఆ స్థానాన్ని పొందిన రెండవ భారతీయ క్రికెటర్ అయింది.

Next Story