- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. కన్నతండ్రి సంచలన నిర్ణయం
ప్రేమ మత్తులో యువత ఆగమైపోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ మత్తులో యువత ఆగమైపోతోంది. జన్మనిచ్చి, విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేసిన కన్నవాళ్లకు కొందరు కన్నీళ్లను మిగులుస్తున్నారు. వలపు వలలో పడి ప్రేమికుడితో కొందరు అమ్మాయిలు ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోతున్నారు. తాజాగా, అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకోగా.. తట్టుకోలేని తండ్రి కడుపుమంటతో ఏకంగా కూతురికి శవయాత్ర చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. విదిశా (Vidisha) ప్రాంతానికి చెందిన దంపతులకు ఓ కూతురు ఉండేది.
అయితే, ఉన్నట్టుండి కన్నబిడ్డ కనిపించకపోవడంతో తండ్రి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా, సదరు యువతి ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన తండ్రి కూతురు రూపాన్ని పిండి ముద్దగా తయారు చేయించాడు. గ్రామస్థులు, బంధువులకు తన కూతురు చనిపోయిందని సమాచారం అందజేశాడు. ఆ తర్వాత కూతురు ప్రతిరూపానికి పాడె కట్టి ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి చితి పేర్చి దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అయితే, ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. శవయాత్రకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






