ప్రచారంలో ప్రమాదం.. బాంబు పేలి కార్యకర్తకు తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

నిప్పుతో చెలగాటం ఆడొద్దని ఊరికే చెప్పలేదు పెద్దలు. తాజాగా, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం విషాదాన్ని నింపింది.

ప్రచారంలో ప్రమాదం.. బాంబు పేలి కార్యకర్తకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిప్పుతో చెలగాటం ఆడొద్దని ఊరికే చెప్పలేదు పెద్దలు. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం విషాదాన్ని నింపింది. బాంబు షాట్స్ కాలుస్తుండగా జరిగిన పేలుడులో ఓ పార్టీ యువ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్‌లో రాజకీయ పార్టీలు హోరెత్తించే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ నాయకుడికి స్వాగతం పలుకుతూ కొందరు కార్యకర్తలు బాణసంచా (Firework shots) కాల్చడం మొదలుపెట్టారు.

సాధారణంగా నేలపై పెట్టి నిప్పంటించిన ‘బాంబు షాట్స్’ను ఓ యువ కార్యకర్త అత్యుత్సాహంతో తన చేతిలో తీసుకున్నాడు. ఇదే సమయంలో అనుకోని విధంగా ఆ బాంబు షాట్ గాలిలోకి వెళ్లకుండా చేతిలోనే ఒక్కసారిగా బ్లాస్ట్ పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి కార్యకర్త అరచేయి, వేళ్లు తీవ్రంగా చిధ్రమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని గమనించిన తోటి కార్యకర్తలు, స్థానికులు వెంటనే అతనిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Next Story