నిరాహార దీక్షలో ఇవేం పనులు రా బాబూ.. నెట్టింట వైరల్

by Ajay Maddhiboyina |

నిరాహార దీక్ష అంటే ఆహారం, నీళ్లు తీసుకోకుండా తాము సాధించాల‌ని అనుకున్న దానికోసం నినాదాలు చేస్తూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం నిరాహార దీక్ష‌లో డీజే పాట‌లు పెట్టుకుని మ‌హిళ‌ల‌తో క‌లిసి చిందులు వేశారు.

నిరాహార దీక్షలో ఇవేం పనులు రా బాబూ.. నెట్టింట వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: నిరాహార దీక్ష అంటే ఆహారం, నీళ్లు తీసుకోకుండా తాము సాధించాల‌ని అనుకున్న దానికోసం నినాదాలు చేస్తూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం నిరాహార దీక్ష‌లో డీజే పాట‌లు పెట్టుకుని మ‌హిళ‌ల‌తో క‌లిసి చిందులు వేశారు. దీంతో వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘటన అమీన్ పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట‌లో చోటు చేసుకుంది. కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూత‌న డివిజ‌న్ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో రిలే నిరాహార దీక్ష చేప‌ట్టారు. అయితే ఈ దీక్ష‌లో కొంద‌రు నాయ‌కులు నిబ‌ద్ద‌తో దీక్ష చేస్తే మ‌రికొంద‌రు మాత్రం డీజే పాట‌లు పెట్టి డ్యాన్సులు చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా కొంత‌మంది మ‌హిళ‌ల‌తో క‌లిసి డ్యాన్స్ చేస్తూ డబ్బుల‌ను చ‌ల్లారు. దీంతో ఇదేం దీక్ష రా బాబూ అంటూ స్థానికులు త‌ల ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు సైతం ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

Next Story