నోరు లేని జీవిపై అంతులేని ప్రేమ.. ఆవు కోసం రోజూ స్పెషల్ దోశ

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-19 11:09:21  IST  )

సృష్టిలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఎన్నో సంఘటనలు తరచూ సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వస్తుంటాయి.

నోరు లేని జీవిపై అంతులేని ప్రేమ.. ఆవు కోసం రోజూ స్పెషల్ దోశ
X

దిశ, వెబ్‌డెస్క్: సృష్టిలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఎన్నో సంఘటనలు తరచూ సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఒక దోశల వ్యాపారి, మూగజీవి పట్ల చూపిన అమితమైన ప్రేమకు సంబంధించిన హృదయాన్ని హత్తుకునే వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక ఆవు ప్రతిరోజూ క్రమం తప్పకుండా సదరు వ్యాపారి నడుపుతున్న దోశల దుకాణం వద్దకు వస్తుంది. ఆ మూగజీవి ఆకలిని గమనించిన ఆ వ్యాపారి.. ఏమాత్రం విసుక్కోకుండా, ఎంతో ప్రేమగా దాని కోసం ప్రత్యేకంగా ఒక దోశను తయారు చేస్తాడు. కాలే పెనంపై దోశ వేసి, అది చక్కగా కాలిన తర్వాత ప్రేమతో ఆ ఆవుకు తినిపిస్తాడు. ఆవు కూడా ఎంతో సాధువుగా, ఆ వ్యాపారి పెట్టే దోశను తింటూ అక్కడ నిలబడటం విశేషం.

ఈ అద్భుతమైన దృశ్యాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు దోశ వ్యాపారి ఉదారతపై, జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "నిజమైన మానవత్వానికి నిదర్శనం ఈ వ్యాపారి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. కల్మషం లేని ఈ మూగజీవాల ప్రేమ, ఆ వ్యాపారి చూపిన ఆదరణ నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.

వైకల్యాన్ని ఓడించిన సంకల్ప బలం.. రెండు చేతులు లేకపోయినా స్ట్రెయిట్ డ్రైవ్ షాట్‌

Next Story