రేయ్ చిన్నూ.. వార్-2 చూస్తావా? కూలీ చూస్తావా? బుడ్డోడి ఆన్సర్‌కు యాంకర్ షాక్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-12 15:02:17  IST  )

క్రియేట్ చేసిన ఏఐ వీడియోలో యాంక‌ర్..హెయ్ చిన్నూ వార్ 2 సినిమా చూస్తావా? కూలీ సినిమా చూస్తావా అంటూ ప్ర‌శ్నిస్తుంది. దానికి బెడ్ పై ప‌డుకున్న బుడ్డోడు లేచి టీవీలో ఖడ్గం సినిమా చూస్తాను అంటూ స‌మాధానం ఇస్తాడు.

రేయ్ చిన్నూ.. వార్-2 చూస్తావా? కూలీ చూస్తావా? బుడ్డోడి ఆన్సర్‌కు యాంకర్ షాక్!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య వైర‌ల్ వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఏఐతో ర‌క‌ర‌కాల వీడియోల‌ను క్రియేట‌ర్లు సృష్టిస్తున్నారు. మ‌నుషులు ఉంటే ఎడిటింగ్ చేసి వీడియోలో కొన్ని మార్పులు చేర్పులు చేయ‌వ‌చ్చు. కానీ అస‌లు మ‌నుషులే లేక‌పోయినా ఏఐతో అద్భుత‌మైన వీడియోల‌ను క్రియేట్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌తో క్రియేట్ చేసే క్యూట్ వీడియోలు నెటిజ‌న్ల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అలాంటి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న వార్ 2, కూలీ సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క్రియేట్ చేసిన ఏఐ వీడియోలో యాంక‌ర్..హెయ్ చిన్నూ వార్ 2 సినిమా చూస్తావా? కూలీ సినిమా చూస్తావా అంటూ ప్ర‌శ్నిస్తుంది. దానికి బెడ్ పై ప‌డుకున్న బుడ్డోడు లేచి టీవీలో ఖడ్గం సినిమా చూస్తాను అంటూ స‌మాధానం ఇస్తాడు. సాధార‌ణంగా ప్ర‌తి ఆగ‌స్ట్ 15న టీవీలో ఖ‌డ్గం సినిమా వేయ‌డం కొన్నేళ్లుగా జ‌రుగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే చేసిన సెటైరిక‌ల్ వీడియో నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. వీడియో

Next Story