- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో .. ఈ కాకుల తెలివి మామూలుగా లేదుగా.. ఏం చేశాయో మీరే చూడండి!
వామ్మో .. ఈ కాకుల తెలివి మామూలుగా లేదుగా.. ఏం చేశాయో మీరే చూడండి!

దిశ, ఫీచర్స్ : కాకులంటే నల్లగా కనిపించే సాధారణ పక్షులే అనుకుంటారు చాలా మంది. కానీ ఇవి అద్భుతమైన తెలివితేటలను కూడా కలిగి ఉంటాయి. ఐక్యతకు మారుపేరుగానూ పెద్దలు ప్రస్తావిస్తుంటారు. ఒకప్పుడు గ్రామాలు, అడవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవి. వాటి జనాభా తగ్గినప్పటికీ ఇప్పుడు నగరాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఇప్పుడీ కాకుల గోల ఏంటి? అనుకుంటున్నారా? గోల కాదు, అద్భుతమైన లీల! ఏంటంటే.. కాకులు మానవుల్లాగే తెలివిమీరి పోతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా తమ లైఫ్ స్టైల్‌ను మార్చుకుంటున్నాయి. అందుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
వైరల్ సమాచారం ప్రకారం.. అది జపాన్‌లోని టోక్యో నగరం. వచ్చీపోయే వాహనాలతో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అయితే ఇక్కడి రోడ్ క్రాసింగ్‌ల వద్ద, ట్రాఫిక్ సిగ్నళ్లవద్ద ఈ మధ్య కాలంలో వాహన దారులతోపాటు తరచుగా కాకులు(crows) కూడా తచ్ఛాడుతూ కనిపిస్తున్నాయట. పైగా అవి గ్రీన్ సిగ్నల్ పడగానే గుంపులుగా రావడం, రెడ్ సిగ్నల్ పడగానే వెళ్లిపోవడం చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు వైల్డ్ లైఫ్ పరిశోధకులు పరిశీలించగా అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఏంటంటే..
కాకులు ఆహార వేటలో భాగంగా టోక్యో సిటీలో ఎక్కువగా దొరికే వాల్‌నట్స్(Walnuts) తీసుకొస్తున్నాయి. కానీ వాటిని పగలగొట్టి తినడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో వాటికి ఒక అద్భుతమైన ఐడియా తట్టినట్టుంది. నోటితో తీసుకొచ్చిన వాల్‌నట్స్‌ను ట్రాఫిక్ సిగ్నళ్లవద్ద గ్రీన్ సిగ్నల్ పడుతున్న క్రమంలోనే పైనుంచి జారవిడుస్తున్నాయి. ఆ సమయంలో వాటిపై నుంచి వాహనాలు వెళ్లడంతో అవి పగిలిపోతున్నాయి. దీంతో రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారులు మధ్యలోకి వచ్చి ముందుగా జారవిడిచిన వాల్స్‌నట్స్ ఎంచక్కా తినేస్తున్నాయి కాకులు. అంటే కాకులు ఎంత తెలివిగా ఆలోచిస్తాయో ఈ సంఘటనే చక్కటి ఉదాహరణగా పేర్కొంటూ @wildheart500 పేరుగల ఇన్‌స్టా యూజర్ దీనిని పోస్ట్ చేయగా, తెగ వైరల్ అవుతోంది. నగరంలో మనుషుల మాదిరిగానే ట్రాఫిక్ రద్దీని, సిగ్నళ్ల పనితీరును కాకులు అర్థం చేసుకోవడం, తెలివిగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.






