గుండె గుభేల్.. నదిలో స్విమ్మింగ్ చేస్తున్న యువతి చేతిలోకి మొసలి!

by Prasad Jukanti |   (  Updated:2026-04-09 09:26:03  IST  )

నదిలో చేప అనుకుని మొసలిని చేతులతో పట్టుకుంది ఒక యువతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు.

గుండె గుభేల్.. నదిలో స్విమ్మింగ్ చేస్తున్న యువతి చేతిలోకి మొసలి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో వీడియోలు వైరల్ (Viral Video) అవుతున్నాయి. అలాంటి ఓ వైరల్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. నదిలో హాయిగా స్విమ్మింగ్ చేస్తున్న ఓ యువతికి మొసలి షాక్ ఇచ్చింది. ఆ దెబ్బతో సదరు యువతికి ప్రాణాలు పోయినంత పనైంది. ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో వివరాలు తెలియనప్పటికీ వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. నదిలో స్విమ్మింగ్ చేస్తూ సరదాగా కేరింతలు కొడుతున్న ఓ యువతికి తన కాళ్లకు ఏదో తగిలినట్లు అనిపించింది. ఏదో పెద్ద చేప అయి ఉంటుందని ఎంతో ఎగ్జైట్ అయింది.

పరుగో పరుగు:

అతే కుతూహలంతో దాన్ని చేతితో పట్టుకుని నీటిపైకి తీసింది. ముందు ఎలాంటి భయం లేకుండా నీటిలో నుంచి పైకి ఎత్తి దాని వైపు చూసే సరికి ఒక్క క్షణంలో గుండె ఆగినంత పనైంది. తాను పైకెత్తింది చేపను కాదు మొసలి పిల్ల చూసి ప్రాణభయంతో దాన్ని నీటిలోకి విసిరేసింది. ఎలైగానా బతికి బయటపడాలనే భయంతో పరుగుపరుగున నది ఒడ్డుకు చేరుకుంది. అయితే వ్యూస్‌ కోసం చేశారో.. లేక నిజంగా జరిగిందో తెలీదు గానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story