- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళను నదిలోకి లాక్కెళ్లిన మొసలి.. గుండెల్లో దడ పుట్టిస్తోన్న వీడియో
జలచరమైన మొసలి క్రూరజంతువన్న విషయం తెలిసిందే. దాన్ని దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

దిశ, వెబ్‌డెస్క్: జలచరమైన మొసలి క్రూరజంతువన్న విషయం తెలిసిందే. దాన్ని దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. శరీరమంతా ముల్లులు ఉన్నట్లుగా కనిపించే మొసలి నోటికి ఒక్కసారి చిక్కితే.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. తాజాగా మొసలి ఒక నదీతీరంలో ఉన్న మహిళను నదిలోకి లాక్కెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోమవారం ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లాలోని నదీతీర గ్రామంలో ఒక మొసలి ఖరస్రోట నదిలోకి మహిళను లాక్కెళ్లింది. బారి బ్లాక్ లోని బోడు పంచాయతీ పరిధిలోని కాంటియా సమీపంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలిని సుకదేవ్ మహాలా భార్య సౌదామిని (55)గా గుర్తించారు. సౌదామిని బట్టలు ఉతికేందుకు నదికి వెళ్లిన క్రమంలో ఈ దారుణ ఘటన జరిగింది.
వైరల్ అవుతున్న వీడియోను చూస్తే.. మొసలి ఆ మహిళను కిందికి లాక్కెళ్తుండగా.. గ్రామస్తులు వంతెన పై నుంచి నిస్సహాయంగా కేకలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సహాయం చేయాలని బిగ్గరగా అరిచినా.. సౌదామినిని కాపాడటం సాధ్యం కాలేదు. ఈ ఘటనపై స్పందించే లోగానే మొసలి అకస్మాత్తుగా ఆమెపైకి దూసుకెళ్లి నీటిలోకి లాగేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. మహిళను మొసలి బారి నుంచి రక్షించలేకపోయారు. గతంలో ఇదే నది వద్ద మొసలి ఒక మేకను లాక్కెళ్లిందని నివాసితులు గుర్తు చేసుకున్నారు. గ్రామస్తులెవరూ నది వద్దకు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు ప్రజలను కోరుతున్నారు.






