- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టల షాపులో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన కానిస్టేబుల్.. వీడియో వైరల్
సాధారణంగా దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుని బొక్కలో వేస్తారు. పోలీసులను చూస్తేనే దొంగలు పారిపోతారు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుని బొక్కలో వేస్తారు. పోలీసులను చూస్తేనే దొంగలు పారిపోతారు. ప్రజలు కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి దొంగతనాలు జరగవని ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆ పోలీసే దొంగగా మారితే ఎవరికి చెప్పుకుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ షాపు యజమానికి. ఉత్తర పదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరట్‌లో ఓ ఇన్‌స్పెక్టర్ బట్టల షాక్ కౌంటర్ నుండి నాలుగు బ్యాగుల బట్టలను దొంగలించాడు.
దొంగలించేటప్పుడు యజమాని చూసి వాటిని తిరిగి ఇచ్చేయాలని కోరాడు. అయినప్పటికీ కానిస్టేబుల్ వాటిని తిరిగి ఇవ్వకుండా దాచిపెట్టుకున్నాడు. ఈ ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ దృష్టికి చేరింది. దీంతో ఆ కానిస్టేబుల్ పై చర్యలకు ఎస్పీ ఆదేశించారు. కానిస్టేబుల్ దొంగతనం వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు.






