ప్రేమించమంటూ కానిస్టేబుల్ టార్చర్.. తాగి అర్ధరాత్రి అమ్మాయి ఇంటి దగ్గర వీరంగం..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-14 13:38:04  IST  )

* అమ్మాయిని ప్రేమించమంటూ కానిస్టేబుల్ వేధింపులు * తాగి ఆమె ఇంటి దగ్గర వీరంగం సృష్టించిన పోలీసు * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ప్రేమించమంటూ కానిస్టేబుల్ టార్చర్.. తాగి అర్ధరాత్రి అమ్మాయి ఇంటి దగ్గర వీరంగం..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ అమ్మాయిని ప్రేమించమంటూ తన ఇంటి దగ్గర రచ్చ చేశాడు కానిస్టేబుల్. మద్యం తాగి ఆమె ఇంటి దగ్గర వీరంగం సృష్టించాడు. దీంతో కుటుంబీకులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేసి.. కానిస్టేబుల్‌ను అప్పగించారు. సదరు కానిస్టేబుల్ డయల్ 112లో పని చేస్తుండగా.. సహోద్యోగులు అతన్ని పట్టుకుని తీసుకెళ్లడం... ఆ ప్రాంతంలో నెలకొన్న గందరగోళానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. పోలీసులే ఇలా చేస్తే దేశం ఎక్కడ సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి పోలీసులను డిస్మిస్ చేయాలని సూచిస్తున్నారు.

Click For Twitter Post .....

Next Story