నవరాత్రుల్లో 18రెట్లు పెరిగిన కండోమ్ సేల్స్

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-01 14:37:26  IST  )

నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌లో ఓ ట్రెండ్ నడుస్తుంటోంది. ముఖ్యంగా కండోమ్ సేల్స్ ఈ టైంలో పెరిగిపోతున్నట్లుగా కొన్నేళ్లుగా కంపెనీలు ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సారి ఏకంగా 18 రెట్లు పెరిగిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

నవరాత్రుల్లో 18రెట్లు పెరిగిన కండోమ్ సేల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌లో ఓ ట్రెండ్ నడుస్తుంటోంది. ముఖ్యంగా కండోమ్ సేల్స్ ఈ టైంలో పెరిగిపోతున్నట్లుగా కొన్నేళ్లుగా కంపెనీలు ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సారి ఏకంగా 18 రెట్లు పెరిగిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఎంత వరకు నిజమనే విషయంపై క్లారిటీ లేదు.

నవరాత్రుల్లో కండోమ్ సేల్స్ ఎందుకు పెరుగుతాయి?

నవరాత్రుల్లో ముఖ్యంగా గుజరాత్‌లో గార్బా, దాండియా డ్యాన్స్ ఈవెంట్స్ పెద్ద మొత్తంలో జరుగుతాయి. ముఖ్యంగా యువకులు రాత్రంతా డ్యాన్స్ చేసేందుకు గుమిగూడుతారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా రాత్రి బయటకు వెళ్లే చాన్స్ రావడంతో ఫ్రీడమ్ టైమ్‌ దొరికేస్తుంది. పైగా ఈ మధ్య ఈ ఈవెంట్స్‌ టికెట్‌ మీద రన్ అవుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు రెండు వేల నుంచి 15వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. మనీ మింటింగ్ మెషిన్స్‌గా ఉన్న ఈ బిజినెస్ కాస్త డ్యాన్స్‌తోనే ఆగడం లేదనేది సత్యం. కాగా సేఫ్ కోసం కండోమ్స్ వాడుతున్నారు. ఇదే కండోమ్ సేల్స్ పెరిగేందుకు అబార్షన్ కేసులు ఎక్కువయ్యేందుకు కారణం అవుతోంది.

Next Story