- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటువైపు రారా!.. చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో.. బుడ్డోడు, గొర్రె పిల్ల క్యూట్ వీడియో వైరల్
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం పెరగిపోయింది. ఏ పని చేసినా నెట్టింట పెట్టేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం పెరగిపోయింది. ఏ పని చేసినా నెట్టింట పెట్టేస్తున్నారు. అయితే అవి కాస్త టైంలోనే వైరల్‌గా మారిపోతున్నాయి. ఇక చిన్నపిల్లల వీడియోలైతే స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని గంటల సమయాల్లోనే ట్రెండింగ్ అయిపోతున్నాయి. ప్రస్తుతం అదే కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ బుడ్డోడు గొర్రె పిల్లను చూసి నువ్వు ఇటు రారా.. నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అన్నట్లు ఓ కాలితో గట్టిగా భూమి మీద కొడుతున్నాడు. అదే టైంలో ఆ బుడ్డోడి మాదిరిగానే గొర్రె పిల్ల కూడా సేమ్ కాళ్లతో కొడుతుంది. ఇక ఈ సన్నివేశాన్ని ఆ బుడ్డోడి తల్లి కెమెరాలో బంధించి ‘ఎందుకు మా చిన్నోడు ఆ గొర్రెపిల్లను బెదిరిస్తున్నాడు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.






