నెట్టింట్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్.. చెప్పులు, చీపుర్లతో రోడ్లపైకి బీజేపీ నేతలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-26 12:59:42  IST  )

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP)కి వ్యతిరేకంగా బీజేపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు.

నెట్టింట్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్.. చెప్పులు, చీపుర్లతో రోడ్లపైకి బీజేపీ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలతో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సెటైరికల్ క్యాంపెయిన్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం నిరసన సెగ రాజుకుంది. యాంటీ కాక్‌రోచ్ (Anti-Cockroach) గ్రూపులుగా ఏర్పడి కొందరు బీజేపీ నేతలు సరికొత్త డిజిటల్ ట్రెండ్‌ను తిప్పికొట్టేందుకు చేతిలోకి చెప్పులు, చీపుర్లు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. ఈ వినూత్న నిరసనకు సంబంధించిన వీడియోలు, హ్యాష్‌ట్యాగ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.

చెప్పులతో కొట్టి.. చీపుర్లతో ఊడ్చి..!

వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు కోర్టు ప్రతిష్టను మసకబార్చేలా మీమ్స్, మర్చండైజ్ బిజినెస్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు వింత ప్రదర్శన చేపట్టారు. వారు వీధుల్లో తిరుగుతూ కనిపించిన బొద్దింకలను తమ కాలిక చెప్పులతో కొడుతూ, చీపుర్లతో ఊడ్చి పారేస్తూ నిరసన తెలిపారు. సమాజంలో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇలాంటి ‘బొద్దింకల’ లాంటి ఐడియాలజీని తాము ఇలాగే ఏరిపారేస్తామని అంటూ నిరసనకారులు కామెంట్ చేశారు. అయితే, ఈ చిత్రం చూసిన నెటిజన్లు కొందరు అటెన్షన్ కోసమే చేస్తున్నారని కొట్టిపారేస్తుండగా, మరికొందరు మాత్రం వ్యంగ్యానికి వ్యంగ్యంతోనే సమాధానం చెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story