CM Chandrababu: వారెవ్వా చంద్రబాబు సింప్లిసిటీ.. స్వయంగా టీ పెట్టిన సీఎం

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-31 07:36:43  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ (Distribution of Pensions) ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

CM Chandrababu: వారెవ్వా చంద్రబాబు సింప్లిసిటీ.. స్వయంగా టీ పెట్టిన సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ (Distribution of Pensions) ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఒకరోజు ముందే సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో సహా మంత్రులు (Ministers), ఎమ్మెల్యే (MLA's)లు అంతా వారి వారి నియోజకవర్గాల్లో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పల్నాడు జిల్లా (Palnadu District) యల్లమంద (Yellamanda)లో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ముందుగా గ్రామస్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా తలారి సారమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు వితంతు పింఛన్ అందజేశారు. ఆమె పిల్లలకు కూడా భవిష్యత్తులో మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం స్వయంగా సీఎం టీ పెట్టి అందరికీ అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీంగా వైరల్ అవుతున్నాయి.

కాగా, పెన్షన్ల (Pensions) పంపిణీలో ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 5,402 మంది వితంతు పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భర్త చనిపోతే వెంటనే భార్యకు పెన్షన్ వచ్చేలా గతంలో ఉన్నట్లుగా 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అదేవిధంగా పెన్షన్ మంజూరు విధానంలో కూడా సర్కార్ స్వల్ప మార్పులు చేసింది. మూడు నెలల పాటు వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోని 50 వేల మందికి సైతం ఇవాళ పెన్షన్ పంపిణీ చేస్తోంది.

Next Story