బస్సులో అమ్మాయిపై చేయి వేసి అక్కడ తాకిన ముసలోడు.. అందరూ చూస్తుండగానే మూడుసార్లు అలా చేసేసరికి.. తట్టుకోలేని అమ్మాయి చివరికి(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-19 11:23:16  IST  )

బస్సులో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి వెనుక సీటులో కూర్చున్నాడు వృద్ధుడు. ఆమె మెడపై మెల్లిగా చేయి వేసి ఏమంటుందోనని టెస్ట్ చేశాడు. అలా రెండు సార్లు ప్రయత్నించాడు.. అనుకోకుండా తాకిందని కలరింగ్ ఇచ్చాడు.

బస్సులో అమ్మాయిపై చేయి వేసి అక్కడ తాకిన ముసలోడు.. అందరూ చూస్తుండగానే మూడుసార్లు అలా చేసేసరికి.. తట్టుకోలేని అమ్మాయి చివరికి(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : బస్సులో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి వెనుక సీటులో కూర్చున్నాడు వృద్ధుడు. ఆమె మెడపై మెల్లిగా చేయి వేసి ఏమంటుందోనని టెస్ట్ చేశాడు. అలా రెండు సార్లు ప్రయత్నించాడు.. అనుకోకుండా తాకిందని కలరింగ్ ఇచ్చాడు. మూడోసారి చేయి వేసిన ముసలోడు.. ఇంకాస్త కిందుగా పోనిచ్చాడు. అప్పుడు.. నిజంగానే తప్పు చేస్తున్నాడని అమ్మాయికి అర్థమైంది. ఇదంతా ఆ బస్సులో ఉన్న కండక్టర్, ఇతర మగాళ్లు చూస్తూనే ఉన్నారు కానీ ఏమనలేకపోయారు. దీంతో ఆమె కోసం ఆమె స్టాండ్ తీసుకుంది. కోపంతో లేచి పెప్పర్ స్ప్రే వేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ముసలోడికి అలాగే కావాలని కామెంట్ చేస్తున్నారు జనాలు. ఇంకొంచెం ఎక్కువ డోస్ ఇచ్చినా మంచిదే అంటున్నారు. కాగా ఈ సీన్ తాజాగా రిలీజ్ అయిన మలయాళం సినిమా ‘మరణమాస్’లోనిది కాగా.. ఈ ఒక్క క్లిప్‌ మూవీని చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తుందంటున్నారు. ఇలాంటి భూతాలు ప్రతిచోట ఉన్నాయని.. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా బాసిల్ జోసేఫ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే బెస్ట్ రివ్యూతో దూసుకుపోతుంది.

Next Story