- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రావే ల*జ.. కొ*జ్జాదాన.. సింగర్ చిన్మయ్‌పై సోషల్ మీడియాలో బండ బూతులు
సోషల్ మీడియాలో సింగర్ చిన్మయి యాక్టివ్‌గా ఉంటుంది. పిల్లలు, అమ్మాయిలపై జరిగే అవమానాలు, ఆకృత్యాల గురించి తన గొంతు వినిపిస్తుంది. ప్రతిరోజూ కచ్చితంగా తన వాయిస్ వినిపిస్తుంది. అయితే ఈ మధ్య ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో సింగర్ చిన్మయి యాక్టివ్‌గా ఉంటుంది. పిల్లలు, అమ్మాయిలపై జరిగే అవమానాలు, ఆకృత్యాల గురించి తన గొంతు వినిపిస్తుంది. ప్రతిరోజూ కచ్చితంగా తన వాయిస్ వినిపిస్తుంది. అయితే ఈ మధ్య ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో చిన్మయి భర్త రాహుల్ రవీంద్ర తన భార్య గురించి మాట్లాడాడు. తనకు నచ్చితేనే మంగళ సూత్రం ధరించమని చెప్పానని.. అబ్బాయిలకు లేని నిబంధనలు అమ్మాయిలకు ఎందుకనేది తన ఉద్దేశమని క్లారిటీగా చెప్పాడు.
అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఓ ట్విట్టర్ స్పేస్‌లో దీనిపై జరిగిన చర్చలో చిన్మయిని రావే ల*జ.. కొజ్జా.. అంటూ బూతులు తిట్టారు. ఇలాంటి వాళ్లకు పిల్లలు పుడితే ఎలా పెంచుతరు.. వాళ్ల పిల్లలు చచ్చిపోవాలి.. అంటూ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా చిన్మయి కుటుంబంపై పచ్చి బూతుల వర్షం కురిపించారు. ఈ విషయం ఆమె దృష్టికి రాగా సజ్జనార్‌కు కంప్లయింట్ చేసింది. ఆ తర్వాత ఆమెను ఈ స్పేస్‌కు ఇన్‌వైట్ చేయగా.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.
సినిమాను, ఆర్టిస్టులను ప్రేమించి ఉన్నత స్థాయిలో నిలబట్టే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అంటూనే తనను ఎందుకు ల*జ అనాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నా భర్త మంగళ సూత్రం గురించి మాట్లాడితే.. నా పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి.. నేను ఎందుకు ల*జ అనిపించుకోవాలి.. నా వల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారా.. నా వల్ల మీ జాబ్ పోతుందా.. మీ శాలరీ పోతుందా.. లేదా నేనేమైనా మీ ట్యాక్స్ తీసుకుంటున్నానా.. అంటూ వాళ్ల భాషలోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది.






