చైనాలో పోలీసుల కొత్త టెక్నాలజీ..జనాల సేఫ్టీ కోసం ప్రత్యేక బస్సు.. వీడియో చూస్తే!

by velandi.Saikiran |

చైనా (China) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కొత్త టెక్నాలజీతో.. చైనా దూసుకు వెళ్తూ

చైనాలో పోలీసుల కొత్త టెక్నాలజీ..జనాల సేఫ్టీ కోసం ప్రత్యేక బస్సు.. వీడియో చూస్తే!
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా (China) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కొత్త టెక్నాలజీతో.. చైనా దూసుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కొత్త టెక్నాలజీ.. ఉపయోగించి ప్రపంచ దేశాలకు... ఆదర్శంగా నిలుస్తోంది. అయితే.. అలాంటి చైనాలో... ప్రజల సేఫ్టీ కోసం ప్రత్యేక బస్సును ( Special Bus) రూపొందించారు. చైనా దేశంలో చిన్న నేరం జరిగిన క్షణాల్లోనే యాక్షన్ ఉంటుంది.

అదే సమయంలో... రోడ్ సేఫ్టీ విషయంలో కూడా సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది చైనా పోలీస్ యంత్రాంగం. రోడ్లపైన...బారీ కేడ్లను ఏర్పాటు చేసేందుకు.. కొత్త టెక్నాలజీ తో బస్సును రూపొందించింది. బారీ కేడ్లను.. ఏర్పాటు చేసేందుకు అలాగే... క్షణాల్లో వాటిని తొలగించేందుకు ఈ బస్సు ఉపయోగపడుతుంది. కింది వీడియోలో చూపించినట్లు... మనుషుల అవసరం లేకుండానే... బారీ కేడ్లను వెంటనే పెట్టవచ్చు అదే సమయంలో తీసేయవచ్చు.

ఈ టెక్నాలజీ కారణంగా సమయం వృధా కాదు. అలాగే.. జనాలకు రోడ్డు ప్రమాదాలు కూడా జరగవు. అయితే టెక్నాలజీ రూపొందించిన బస్సు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్.. పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ... ఇండియాలో కూడా వస్తే బాగుంటుందని అంటున్నారు.

Twitter Link

Next Story