బంగారం వేస్తే.. డబ్బులు వచ్చే ATM.. చైనాలో మరో టెక్నాలజీ!

by velandi.Saikiran |

ఏటీఎం బంగారం కొలిచిన 30 నిమిషాల్లోనే.. బ్యాంకు ఖాతాలలోకి డబ్బులు పంపిస్తుంది. ఇక ఈ గోల్డ్ ఏటీఎంలు కనీసం

బంగారం వేస్తే.. డబ్బులు వచ్చే ATM.. చైనాలో మరో టెక్నాలజీ!
X

దిశ, వెబ్ డెస్క్: చైనా (China) అద్భుతమైన టెక్నాలజీతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మనుషులు చేసే పనులను దాదాపు మెషిన్లతోనే.. అక్కడ చేయిస్తూ ఉంటారు. తక్కువ సమయంలో ఎక్కువ పని అయ్యేలా... రోబోలను కూడా ఇప్పటికే దించేశారు. తినే ఆహారం నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో కూడా కొత్త టెక్నాలజీని చైనా అమలు చేస్తోంది.

ఇక ఈ నేపథ్యంలోనే... ఏటీఎంలో విషయంలో కీలక నిర్ణయం తీసుకుందట చైనా. బంగారం వేసి.. కరిగిస్తే, డబ్బులు వచ్చేలా.. సరికొత్త ఏటీఎం మెషిన్ తయారు చేసినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. వీడియోలో చూపించినట్లుగా... మన దగ్గర ఉదాహరణకు 3 గ్రాముల బంగారం ఉంటే.. ఆ ఏటీఎం మెషిన్ లో వేయాలి. అనంతరం ఆ మెషిన్.. బంగారం ఎంత బరువు ఉందో లెక్కిస్తుంది. అనంతరం ఆ బరువుకు తగ్గట్టు ఆ రోజున.. ఉండే బంగారం ధర ప్రకారం డబ్బులు ఏటీఎం ద్వారా ఖాతాలోకి వస్తాయి.

ఈ విషయాన్ని కింద ఉన్న వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ ఏటీఎం బంగారం కొలిచిన 30 నిమిషాల్లోనే.. బ్యాంకు ఖాతాలలోకి డబ్బులు పంపిస్తుంది. ఇక ఈ గోల్డ్ ఏటీఎంలు కనీసం మూడు గ్రాముల బంగారం ఉండే లేదా కనీసం 50% స్వచ్ఛత ఉన్న బంగారు వస్తువులను మాత్రమే స్వీకరిస్తుందని అంటున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీ ఇండియాలో వస్తే బాగుండేదని... అంటున్నారు. క్లిక్


Next Story