- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చవక చవక.. మార్కెట్‌లోకి ఇండిగో ఆటోలు! విమానాల రద్దుపై వీడియో.. వైరల్
ఓ నెటిజన్ ఏం చేశాడో తెలుసా? నేరుగా ఇండిగో విమానాన్ని ఆటో వెర్షన్‌గా మార్చేశాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇక్కట్లుపడుతుంటే.. ఈ గందరగోళాన్ని సీరియస్‌గా తీసుకున్న ఓ నెటిజన్ ఏం చేశాడో తెలుసా? నేరుగా ఇండిగో విమానాన్ని ఆటో వెర్షన్‌గా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో.. నీలం, తెలుపు కలర్ IndiGo స్టైల్ ఆటోను డ్రైవ్ చేస్తూ కనిపిస్తున్నారు. బయటకి రెక్కలు, పక్కన ఇంజిన్‌లా కనిపించే డబ్బా, ముందుకు విమానం ముక్కు స్టైల్ డిజైన్, అన్ని భాగాలు ఫుల్ జెట్ ఫీలింగ్ కల్గిస్తోంది.
ఈ ఇండిగో ఆటో నడుపుతున్న వ్యక్తి.. ‘బోపాల్ నుంచి ముంబాయ్.. అక్కడి నుంచి దుబాయ్.. అక్కడి నుంచి యూకే’ అంటూ రెగ్యూలర్ ఆటో డ్రైవర్ల మాదిరి ప్రయాణికులను పిలుస్తున్నాడు. రిక్షా మీటర్ రూ.10 నుంచే స్టార్టింగ్.. కానీ డెస్టినేషన్ నేరుగా లండన్‌కు తీసుకెళ్తానని ఆటో డ్రైవర్ చెబుతున్నాడు. అయితే ఇది నిజం కాదు. AIతో రూపొందించిన వీడియో. కానీ సోషల్ మీడియాలో ఇండిగో సంక్షోభం వేళ నెటిజన్‌లు వీడియోతో సరదాగా పోస్ట్ చేశారు.
దీనిపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ రద్దు అయిన.. ఇండిగో ఆటో లైన్స్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయ్యాయ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు పైలట్ కావాలంటే DGCA ఎగ్జామ్ అవసరం లేదని, ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. లాస్ట్ కాల్ ప్యాసింజర్స్.. చాయ్, సమోసా తీసుకుని ఎక్కండి అంటూ అని మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టారు. ఇండిగో ఆటో ప్రయాణం ఫీజు చాలా చవక అని తెలిపారు. అయితే రిఫండ్ కోసం ఇండిగో కస్టమర్ కేర్‌కి కాల్ చేయగా.. వారు ‘సార్ ఆటో దగ్గరే మాట్లాడండి’ అన్నారట.. అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. దేశం మొత్తం విమానాల రద్దుతో అయోమయంలో ఉండగా, ఈ ఇండిగో ఆటో మాత్రం ఇంటర్నెట్‌ని ఊపేస్తోంది. వీడియో ఇదే..






