- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్: ఫంక్షన్స్‌లో స్టెప్పులు వేసే ఫేమస్ డీజే సాంగ్ "బుట్టో" ఆ పొలిటికల్ పార్టీదా?
పెళ్లిళ్లు, పేరంటాలు ఏ ఫంక్షన్ వచ్చినా, దేవుడి ఊరేగింపులు అయినా డీజే ఉందంటే అంతా కలిసి స్టెప్పులు వేయాల్సిందే. అయితే ఎన్నో డీజే పాటలు, సినిమా పాటలు ఉన్నా పొలిటికల్ పాటలకు సైతం జనాలు వైబ్ అవుతూ ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లిళ్లు, పేరంటాలు ఏ ఫంక్షన్ వచ్చినా, దేవుడి ఊరేగింపులు అయినా డీజే ఉందంటే అంతా కలిసి స్టెప్పులు వేయాల్సిందే. అయితే ఎన్నో డీజే పాటలు, సినిమా పాటలు ఉన్నా పొలిటికల్ పాటలకు సైతం జనాలు వైబ్ అవుతూ ఉంటారు. గణేష్ నిమజ్జనం, పెళ్లి భరత్ ఇలా ఎక్కడైనా తమకు నచ్చిన పార్టీ లేదా నచ్చిన లీడర్ పాటలు పెట్టి స్టెప్పులు వేస్తుంటారు. అయితే మనకు భరత్ లలో డీజేల వద్ద ఎక్కువగా వినిపించే పాటల్లో బుట్టో పాట కూడా ఉంటుంది. బుట్టో మ్యూజిక్ వస్తే ముసలోళ్లు కూడా లేచి డ్యాన్స్ చేస్తారు.
అయితే ఇది కూడా సాధారణ డీజే పాట అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. నిజానికి బుట్టో అనేది ఓ పొలికల్ పాట. అంతే కాకుండా ఇది పాకిస్థాన్ కు చెందిన ఓ హిందీ పాట కావడం విశేషం. బుట్టో ఒరిజనల్ పాటను పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజిర్ బుట్టో పార్టీ కోసం ట్యూన్ చేశారు. ఈ పాటను 1992లోనే ట్యూన్ చేయడం ఆసక్తికరం. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కోసం ఈ పాటను ట్యూన్ చేసి అప్పటి ఎన్నికల్లో వాడారు. ఆ తరవాత ఈ పాటకు డీజే ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఇప్పుడు దీని డీజే వర్షన్ ప్రతి ఫంక్షన్లో కచ్చితంగా వినిపిస్తుంది.






