- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sanjana Ganeshan : నా కొడుకు జోలికి వస్తే ఊరుకోను : బుమ్రా వైఫ్ మాస్ వార్నింగ్
నెట్టింట్లో తన కుమారుడిపై విమర్శలు చేస్తున్న వారికి ఇండియన్ క్రికెటర్ జస్ ప్రీత్ బుమ్రా(Jasprit Burmah) వైఫ్ సంజనా గణేశన్(Sanjana Ganeshan) మాస్ వార్నింగ్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : నెట్టింట్లో తన కుమారుడిపై విమర్శలు చేస్తున్న వారికి ఇండియన్ క్రికెటర్ జస్ ప్రీత్ బుమ్రా(Jasprit Burmah) వైఫ్ సంజనా గణేశన్(Sanjana Ganeshan) మాస్ వార్నింగ్ ఇచ్చింది. మీ వినోదం కోసం ఏడాదిన్నర వయసున్న చిన్న పిల్లాడి టాపిక్ తీసుకు రావాల్సిన అవసరం లేదని మండిపడింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్(LSG), ముంబై ఇండియన్స్(MI) మధ్య ఐపీఎల్(IPL) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు కీలక వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. ఇది పక్కన పెడితే ఈ మ్యాచ్‌లో బుమ్రాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన అతడి కొడుకు అంగద్‌పై కొందరు పనిగట్టుకుని ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. బుమ్రా బౌలింగ్‌కి లక్నో బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ వాంఖడే మైదానమంతా జస్ప్రీత్ నినాదంతో హోరెత్తింది. అయితే కొడుకు అంగద్ కాస్త నీరసంగా కనిపించిన కొన్ని క్లిప్స్ నెటిజన్లను ఆకర్షించాయి. దీంతో అంగద్ పేస్ ఎక్స్ ప్రెషన్స్‌పై కొందరు ట్రోలింగ్ చేశారు.
డిప్రెషన్ వంటి పదాలను వాడుతూ అంగద్ ఫోటో వాడుకున్నారు. దీంతో బుమ్రా భార్య సంజన గణేశన్ విమర్శకులకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. మేము బుమ్రాను సపోర్ట్ చేసేందుకే వచ్చాము. మా బాబుని వైరల్ చేయడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ‘సెకన్ల పాటు ఉన్న క్లిప్‌లో అంగద్ కదలికలను బట్టి ఏదేదో రాస్తున్నారు. డిప్రెషన్ వంటి పదాలను వాడుతున్నారు. ఏడాదిన్నర బాబుపై ఇలాంటి పదాలను వాడటం బాధ కలిగించింది. మీ ఒపీనియన్స్ మీ దెగ్గర పెట్టుకోండి. ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు’ అంటూ సంజన తన ఇన్‌స్టా స్టోరీలో వార్నింగ్ పోస్ట్ పెట్టారు. సంజనకు ముంబై ఫాన్స్ తో పాటు క్రికెట్ ప్రేమికులు మద్దతుగా నిలుస్తున్నారు.






