- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bumper Officer: పెట్రోల్ కొట్టించుకో.. డబ్బు ఆదా చేసుకో! భారత్ పెట్రోల్ బంక్ బంపర్ ఆఫర్
వాహనాల్లో పెట్రోల్ కొట్టించడం పేద, మధ్య తరగతి వాహనదారులకు బిగ్ టాస్క్.

దిశ, వెబ్‌డెస్క్: వాహనాల్లో పెట్రోల్ (Petrol) కొట్టించడం పేద, మధ్య తరగతి వాహనదారులకు బిగ్ టాస్క్. కొందరు మైలేజ్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ.. డబ్బు ఆదా చేస్తుంటారు. మరికొందరు నెలలో ఖచ్చితమైన టార్గెట్‌ను పెట్టుకుని అంత వరకే తన వాహనాల్లో పెట్రోల్‌ను కొట్టిస్తారు. ఆ విషయం అటుంచితే.. కొన్ని పెట్రోల్ బంక్ (Petrol Bunk)లలో నిర్వాహకులు తునికలు, కొలతల శాఖ అధికారుల కళ్లుగప్పి తామేం తక్కువ కాదు అన్నట్లుగా మీటర్ రీడింగ్స్‌ను ట్యాంపర్ (Tamper) చేస్తూ.. వినియోగదారులకు లీటర్‌పై తక్కువ పెట్రోల్ ఫిల్ చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు.
నిత్యం అలాంటి ఘటనలు వెలుగుచూస్తున్న తరుణంలో భారత్ పెట్రోలియం (Bharat Petroleum)వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. తమ అండర్ ఉన్న బంక్‌లలో సేల్స్ పెంచుకునేందుకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ కొట్టిస్తే.. రూ.2 లకు పైగా అదనంగా పెట్రోల్‌ను ఫిల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కస్టమర్ భారత్ పెట్రోల్ బంక్ (Bharat Petrol Bunk)కు వెళ్లి బైక్‌లో 3 లీటర్ల పెట్రోల్ ఫిల్ చేయించుకోగా.. అతడికి రూ.6.47 పెట్రోల్ అదనంగా వచ్చింది. ఆ చిత్రం చూసిన వాహనదారుడు ఇదేంటని బంక్‌లో పని చేసే సిబ్బందని ప్రశ్నించగా.. లీటర్ పెట్రోల్‌పై రూ.2 అదనంగా ఫిల్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇతర వాహనాదారులు కూడా భారత్ పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్ కొట్టించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆదనపు పెట్రోల్ ఆ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ పేమెంట్ (Online Transaction Payments)కు సంబంధించిన రిసిప్ట్ సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది.






