దుకాణంలోకి దూసుకొచ్చిన దున్న‌పోతు !

by velandi.Saikiran |

దారి తప్పి మార్కెట్ లోకి దూసుకు వచ్చింది ఓ దున్నపోతు... చైనా బజార్ తరహాలోనే ఉన్న దుకాణంలోకి దూసుకు వచ్చింది.

దుకాణంలోకి దూసుకొచ్చిన దున్న‌పోతు !
X

దిశ‌, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. కొన్ని వీడియోలు హార్ట్ ట‌చింగ్ వీడియోలు కూడా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఓ దున్నపోతు చేసిన రచ్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రైతుకు సంబంధించిన దున్నపోతు, దారి తప్పి మార్కెట్ లోకి దూసుకు వచ్చింది. ఇందులో భాగంగానే చైనా బజార్ తరహాలోనే ఉన్న ఓ దుకాణంలోకి దూసుకు వచ్చింది.

ఆ దుకాణంలో జనాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వేగంగా దూసుకు వచ్చి, ఆ దుకాణంలో ఉన్న సామాన్లను ఢీ కొట్టింది. ఈ దెబ్బకు వస్తువులు అన్ని తుక్కు తుక్కు అయ్యాయి. అటు దుకాణంలోకి దున్నపోతు దూసుకు వచ్చిన నేపథ్యంలో, లోపల ఉన్న జనాలు భయాందోళనకు గురయ్యారు. ఆ దుకాణంలో నుంచి దొడ్డి దారిన పారిపోయారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆ దున్నపోతు, మరో దుకాణం పై కూడా దాడి చేసినట్లు వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story