మందేసి పెళ్లి మండపానికి వధువు.. ఓ చేతిలో గ్లాస్.. మరో చేతిలో సిగరెట్‌తో హల్ చల్.. నోరెళ్లబెట్టిన బంధువులు..

by Sujitha Rachapalli |

సాధారణంగా పెళ్లి అంటే అమ్మాయికైనా, అబ్బాయికైనా టెన్షన్ అనేది ఉంటుంది. కొత్త జీవితం ఎలా ఉంటుందోననే ఆలోచనతో నిద్రపట్టదు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే కొత్త ప్లేస్‌కు వెళ్లాలి.. అందరితో కలిసిపోవాలి.. సెట్ కావాలి.. అనే ఆలోచనతో ఉంటారు.

మందేసి పెళ్లి మండపానికి వధువు.. ఓ చేతిలో గ్లాస్.. మరో చేతిలో సిగరెట్‌తో హల్ చల్.. నోరెళ్లబెట్టిన బంధువులు..
X

దిశ, వెబ్‌సైట్ : సాధారణంగా పెళ్లి అంటే అమ్మాయికైనా, అబ్బాయికైనా టెన్షన్ అనేది ఉంటుంది. కొత్త జీవితం ఎలా ఉంటుందోననే ఆలోచనతో నిద్రపట్టదు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే కొత్త ప్లేస్‌కు వెళ్లాలి.. అందరితో కలిసిపోవాలి.. సెట్ కావాలి.. అనే ఆలోచనతో ఉంటారు. పెళ్లి రోజు దగ్గరపడే కొద్దీ అమ్మానాన్నను, తోబుట్టువులను విడిచివెళ్లాలనే బాధ ఎక్కువైపోతుంది. ఇక పెళ్లి రోజు అయితే కడుపులో సీతాకోక చిలుకలు పరుగెత్తిన ఫీలింగ్ వస్తుంది. అంత టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం పెళ్లి కూతురుగా ముస్తాబై.. మందేసి చిందేసింఅవును.. తన పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్‌తో మందు కొడుతూ ఎంజాయ్ చేసింది. ఓ చేతిలో గ్లాస్.. మరో చేతిలో సిగరెట్‌తో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక ఈ వీడియో చూస్తున్న జనాలు.. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి.. వివాహం జరిగే ముందు పూజ చేయాలి.. కానీ ఈ అమ్మాయి మందేసింది.. పెళ్లి మండపానికి వెళ్లింది.. ఎంత దారుణం అంటున్నారు. ఓ వ్యక్తి తన కాబోయే భాగస్వామి కోసం ఎంతో ప్రేమతో ఆత్రుతగా ఎదురుచూస్తుడు.. కానీ ఈమె ఇలాంటి పనులు చేసి వెళ్తుందని ఇంకొంకరు కామెంట్ చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తర్వాత పాపం పిల్లాడి పరిస్థితేంటో అని ఇంకొందరు జాలిపడుతున్నారు.

VIDEO


Next Story