ఎదురు కట్నం ఇచ్చిన పెళ్లి కొడుకు.. హ్యాండ్ ఇచ్చిన పెళ్లి కూతురు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-22 05:57:36  IST  )

పెళ్లి కొడుకు ఎదురు కట్నం ఇచ్చాడు.. మూడెకరాలు పొలం అమ్మి పెళ్లిలో ఏ లోటు లేకుండా జాగ్రత్తపడ్డాడు.. వధువుకు బంగారు నగలు, పెళ్లి చీరలు అన్నీ కొనిచ్చాడు.. కానీ చివరకు జోకర్ అయిపోయాడు..

ఎదురు కట్నం ఇచ్చిన పెళ్లి కొడుకు.. హ్యాండ్ ఇచ్చిన పెళ్లి కూతురు..
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి కొడుకు ఎదురు కట్నం ఇచ్చాడు.. మూడెకరాలు పొలం అమ్మి పెళ్లిలో ఏ లోటు లేకుండా జాగ్రత్తపడ్డాడు.. వధువుకు బంగారు నగలు, పెళ్లి చీరలు అన్నీ కొనిచ్చాడు.. కానీ చివరకు జోకర్ అయిపోయాడు.. పాపం.. పెళ్లిలో జోష్‌తోనే ఉన్న పెళ్లి కూతురు.. బరాత్ అయిపోయే లోపు కనిపించకుండా పోయింది. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న ఆమె.. క్షణంలో మాయం అయిపోయింది. ఎక్కడ వెతికినా దొరకలేదు. దీంతో పెళ్లి కొడుకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. ఇంత చేస్తే ఇలా వెళ్లపోయిందేంటా అని ఏడ్చేశాడు. బంధువులు కూడా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ బారాబంకీలో ఈ ఘటన జరగ్గా.. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి కూతురు కనిపించకుండా పోవడంలో లవ్ యాంగిల్ ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.

Next Story