ఛీ.. వీడు హీరోలా లేడు నాకొద్దు.. వరుడికి మండపంలోనే షాక్ ఇచ్చిన వధువు

by Ajay Maddhiboyina |

ప్ర‌స్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టంతో పెళ్లీడుకు వ‌చ్చిన అమ్మాయిలు, వారి త‌ల్లిదండ్రులు గొంతెమ్మ కోరిక‌లు కోరుతున్నారు. త‌మ‌కు ఎక‌రం లేక‌పోయినా ప‌దెక‌రాలు ఉన్న అల్లుడు కావాల‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటే.. తాము అందంగా లేక‌పోయినా మ‌హేశ్ బాబు లాంటి అబ్బాయే కావాల‌ని అమ్మాయిలు కోరుకుంటున్నారు.

ఛీ.. వీడు హీరోలా లేడు నాకొద్దు.. వరుడికి మండపంలోనే షాక్ ఇచ్చిన వధువు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టంతో పెళ్లీడుకు వ‌చ్చిన అమ్మాయిలు, వారి త‌ల్లిదండ్రులు గొంతెమ్మ కోరిక‌లు కోరుతున్నారు. త‌మ‌కు ఎక‌రం లేక‌పోయినా ప‌దెక‌రాలు ఉన్న అల్లుడు కావాల‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటే.. తాము అందంగా లేక‌పోయినా మ‌హేశ్ బాబు లాంటి అబ్బాయే కావాల‌ని అమ్మాయిలు కోరుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌ధ్య ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. పెళ్లి వ‌ర‌కు వ‌చ్చ‌న త‌ర‌వాత పెళ్లి కొడుకు హీరోలా లేడ‌ని త‌న‌కు వ‌ద్ద‌ని వ‌ధువు షాక్ ఇచ్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం షాడోల్ జ‌ల్లా బైహార్ గ్రామానికి చెందిన యువ‌తికి క్ష అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది.

మొద‌ట పెళ్లి చూపుల్లో ఓకే చెప్పిన అమ్మాయికి పెళ్లి మండ‌పంలో మాత్రం అత‌డు న‌చ్చ‌లేదు. దీంతో అక్క‌డే వీడు ఫోటోలో క‌నిపించిన‌ట్టు, పెళ్లి చూపుల్లో క‌నిపించిన‌ట్టు హీరోలా లేడు అంటూ గొడ‌వ పెట్టింది. తాను అనుకున్న హీరో ముఖం అత‌డికి లేద‌ని గోల గోల చేసింది. పెళ్లి కూతురు గొడ‌వ చేయ‌డంతో అబ్బాయి త‌రుపున వాళ్లు, అమ్మాయి త‌రుపు బంధ‌వుల మ‌ధ్య కూడా గొడ‌వ మొదలై అది కాస్తా తారాస్థాయికి చేరుకుంది. చివ‌రికి పోలీసుల‌కు స‌మాచారం అందడంతో వారు ఎంట్రీ ఇచ్చి ఇరు వ‌ర్గాల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

పెళ్లి ఆగిపోవ‌డంతో అబ్బాయి కుటుంబ స‌భ్యులు, బంధువులు తిరిగి వెళ్లిపోయారు. రీసెంట్ గా ఇలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లిలో ఫోటోగ్రాఫ‌ర్ ను అరేంజ్ చేయలేద‌ని ఓ యువ‌తి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇక మ‌రో ఘ‌ట‌న‌లో అమ్మాయి పెళ్లి కొడుకు మెడ‌లో వ‌ర‌మాల వేస్తుండ‌గానే స్టేజి మీద నుండి దూకి అక్క‌డే ఉన్న ప్రియుడితో క‌లిసి కారులో పారిపోయింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జ‌రుగుతుండ‌టంతో పెళ్లి కాని ప్ర‌సాదులో పెళ్లి అంటేనే వ‌ణికిపోతున్నారు. బాబోయ్ మాకొద్దీ పెళ్లి అంటూ దండం పెడుతున్నారు.

Next Story