ఇనుప పెట్టేలో ప్రియుడిని దాచేసిన లేడీ..అంత‌లోనే ఫ్యామిలీ ఎంట్రీ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-23 18:06:44  IST  )

తన కుటుంబ సభ్యులకు ప్రియుడు కనిపించకుండా ఏకంగా ఇనుప పెట్టలోని దాచి పెట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో చోటుచేసుకుంది.

ఇనుప పెట్టేలో ప్రియుడిని దాచేసిన లేడీ..అంత‌లోనే ఫ్యామిలీ ఎంట్రీ !
X

దిశ, వెబ్ డెస్క్‌: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ ప్రేమ జంటకు సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ప్రియుడిని కాపాడుకునేందుకు ఓ లేడీ చేసిన పని అంతా కాదు. తన కుటుంబ సభ్యులకు ప్రియుడు కనిపించకుండా ఏకంగా ఇనుప పెట్టలోని దాచి పెట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో చోటుచేసుకుంది.

ప్రియుడిని ఇనుప పెట్టెలో దాచిన ప్రియురాలు

ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అసలు పెద్దవాళ్లు చేసిన సంబంధాలు ఎవరు చేసుకోవడం లేదు. చదువుకునే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర తమకు నచ్చిన వారిని చూడడం, పెళ్లి చేసుకోవడం జరుగుతోంది. ఇంకా కొంతమంది ప్రేమలో ఉంటూ రహస్యంగా కలుసుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా కాన్పూర్ కు చెందిన ఓ లేడీని కలిసేందుకు ప్రియుడు ఆమె ఇంటికి వెళ్ళాడు.

ఈ నేపథ్యంలోనే ఆ ఇంట్లోనే ఓ రోజంతా ఆ కుర్రాడు ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని ఓ ఇనుప పెట్టలో దాచిపెట్టిందట ప్రియురాలు. ఓ రోజంతా అలాగే ఉన్న నేపథ్యంలో సౌండ్ రావడం ఆ లేడీ ఫ్యామిలీ పసిగట్టింది. అనంతరం ఆ ఇనుప పెట్టెను తెరిచి చూడడంతో కుర్రాడు బయటకు వచ్చాడు. అనంతరం అతన్ని పోలీసులు అప్పగించారు కుటుంబ సభ్యులు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అటు ప్రేమలో ఉన్న ఆ లేడీ మైనర్ అని సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగి, ప్రియుడిని తీసుకువెళ్లారట.

Next Story