#boycottlaila : ట్రెండింగ్ లో "లైలా" బాయ్‌కాట్

by Muthe.Rajitha |   (  Updated:2025-02-11 12:12:14  IST  )

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(VishvakSen) తాజా 'లైలా'(Laila) చిత్రం వివాదంలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే.

#boycottlaila : ట్రెండింగ్ లో లైలా బాయ్‌కాట్
X

దిశ, వెబ్ డెస్క్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్(VishvakSen) తాజా 'లైలా'(Laila) చిత్రం వివాదంలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో న‌టుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఒక వ‌ర్గానికి కోపం తెప్పించ‌డంతో సోష‌ల్ మీడియాలో హ్యాష్ టాగ్ బాయ్‌కాట్ 'లైలా'(#boycottlaila) ట్రెండ్ న‌డుస్తుంది. అసలు ఏం జ‌రిగిందంటే.. 'లైలా' ప్రీ రిలీజ్ వేడుక‌లో న‌టుడు పృథ్వీ(Prudhviraj) మాట్లాడుతూ.. 'ఇందులో నేను మేక‌ల స‌త్తిగా చేశాన‌ని తెలిపారు. అయితే మేక‌లు ఎన్ని ఉన్నాయ‌ని షాట్ మ‌ధ్యలో అడిగితే 150 ఉన్నాయని తెలిపాను. అయితే షాకింగ్ ఎంటో కానీ సినిమా చివ‌రిలో లెక్కేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్రమే' ఉన్నాయ‌ని తెలిపారు. అయితే ఈ కామెంట్లు వైసీపీ(YCP)ని ఉద్దేశించే చేశాడంటూ వైసీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో 151 సీట్లు గెలిచిన వైసీపీ గ‌త ఎన్నిక‌ల‌లో 11 సీట్లకు మాత్రమే ప‌రిమితం అయ్యింది. దీంతో పృథ్వీ వైసీపీ గురించే కామెంట్లు చేశాడ‌ని లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్‌ని స్టార్ట్ చేశారు.

దాదాపు 25 వేల లైలా బాయ్‌కాట్ పోస్టులు పెట్టి, ట్విటర్ ట్రెండింగ్(Twitter Trending) లోకి తెచ్చారు. పైగా సినిమా విడుదల అయిన రోజే HD ప్రింట్(HD Print) మూవీని సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులు కూడా చేశారు. అయితే ఈ వ్యవహారం ముద‌ర‌డంతో న‌టుడు విశ్వక్‌సేన్ క్షమాప‌ణ‌లు కూడా తెలిపాడు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'లైలా సినిమాను విడుద‌లయిన రోజే HD ప్రింట్ సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారు. 25000 ట్విట్లు వేశారు. బాయ్‌కాట్ లైలా అంటూ.. కామెంట్లు పెట్టారు. సినిమా వాళ్లు ఈజీగా టార్గెట్ అవుతామా అనిపిస్తుంది ఇవి చూస్తుంటే. పృథ్వి చేసిన కామెంట్స్‌కు సినిమా యూనిట్‌కు సంబంధం లేదు. స్టేజ్ పై పృథ్వి మాట్లాడేటప్పుడు నేను నిర్మాత లేము. మేమిద్దరం చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాము. పృథ్వి మీద కోపం నా సినిమాపై చూపిస్తున్నారు. ద‌య‌చేసి ఇలా చేయ‌కండి. ఇలా చేసి సినిమాను చంపేయ‌కండి. నాతో శ‌త్రుత్వం లేన‌ప్పుడు నా సినిమాను ఎందుకు టార్గెట్ చేస్తారు' అని భావోద్వేగానికి గురయ్యాడు.

Next Story