డెలివరీ యాప్స్‌ను ఇలా కూడా వాడొచ్చా? డెలివరీ బాయ్ రియాక్షన్ చూస్తే జాలి వేయాల్సిందే!

by Ramesh Naini |

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక డెలివరీ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లోకి కావాల్సిన సరుకుల నుండి ఆఫీస్ ఫైళ్ల వరకు అన్నింటినీ చేరవేయడానికి ఈ సర్వీసులను వాడుతుంటాం.

డెలివరీ యాప్స్‌ను ఇలా కూడా వాడొచ్చా?  డెలివరీ బాయ్ రియాక్షన్ చూస్తే జాలి వేయాల్సిందే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక డెలివరీ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లోకి కావాల్సిన సరుకుల నుండి ఆఫీస్ ఫైళ్ల వరకు అన్నింటినీ చేరవేయడానికి ఈ సర్వీసులను వాడుతుంటాం. కానీ, ఒక మహిళ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా తన ఇంట్లోని చెత్తను పారవేయడానికి ఏకంగా ‘పోర్టర్’ (Porter) డెలివరీ యాప్‌ను ఉపయోగించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

700 మీటర్ల దూరంలోనే లొకేషన్

వైరల్ వీడియో ప్రకారం.. ఒక డెలివరీ పార్ట్‌నర్ తన స్కూటీపై ఒక కస్టమర్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఒక యువతి అతనికి ఒక చిన్న కాటన్ బాక్స్‌ను అప్పగించి, సుమారు 700 మీటర్ల దూరంలో ఉన్న ఒక లోకేషన్‌కు డెలివరీ చేయాలని కోరింది. లోపల ఏముందో తెలియని ఆ డెలివరీ బాయ్, బాక్స్‌ను తీసుకుని చెప్పిన అడ్రస్‌కు చేరుకున్నాడు. డెలివరీ పాయింట్‌కు చేరుకున్నాక బాక్స్ తీసుకోవడానికి అక్కడ ఎవరూ కనిపించలేదు. దీంతో సదరు డెలివరీ పార్ట్‌నర్ కస్టమర్‌కు ఫోన్ చేసి.. ‘మేడమ్, ఇక్కడ బాక్స్ తీసుకోవడానికి ఎవరూ లేరు, ఎవరికి ఇవ్వాలి?’ అని అడిగాడు. దానికి ఆమె సమాధానమిస్తూ.. ఆ బాక్స్ ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని, అక్కడే పారేయాలని కోరింది.

ఇదే మన వికసిత్ భారత్..?

దీంతో అనుమానం వచ్చిన డెలివరీ బాయ్ ఆ బాక్స్‌ను తెరిచి చూడగా, అందులో కుళ్ళిన కూరగాయలు, ఇంటి చెత్త ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సదరు డెలివరీ బాయ్ ఈ వింత అనుభవాన్ని వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘ఇలా కూడా పోర్టర్ బుకింగ్ చేస్తారా? ఇది మన వికసిత్ భారత్’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి, ఆ చెత్తను అక్కడే ఉన్న డస్ట్‌బిన్‌లో పడేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో చెత్తను పారవేయడానికి ఇదొక తెలివైన మార్గం అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుంటే.. ‘ఇది కేవలం వ్యూస్ కోసం తీసిన స్క్రిప్టెడ్ వీడియో (Scripted Video) లాగా ఉంది’ అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు.

Next Story