- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నన్ను ఆశీర్వదించమ్మా’..! సీతక్క కాళ్లు మొక్కిన మంత్రి పొన్నం ప్రభాకర్
దేశ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి (Rakhi Pournami) వేడుకలు అంబరాన్నంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి (Rakhi Pournami) వేడుకలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే అక్కా, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీలు కట్టి మంగళహారతులు పాడుతున్నారు. అనంతరం స్వీట్లు తినిపిస్తూ.. జోరుగా వారి నుంచి కట్నాలు, కానుకలు స్వీకరిస్తున్నారు. ఇక మంత్రి సీతక్క (Minister Seethakka) ఇవాళ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అదేవిధంగా ఆమె మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్న, చెల్లెళ్ల మధ్య అనుబంధానికి, ఆప్యాయతకు అద్దంపడుతూ.. ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి పొన్నంకు రాఖీ కట్టగానే.. ‘నన్ను ఆశీర్వదించమ్మా’ అంటూ ఆయన సీతక్క కాళ్లకు నమస్కారం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ఆహా ఇది కదా.. అసలు సిసలైన అన్న, చెల్లెళ్ల అనుబంధమంటూ కామెంట్ చేస్తున్నారు.






