కళ్ల ముందే చెదిరిన గూడు.. ఎన్నో ప్రాణాలకు నీడనిచ్చి నిలువెల్లా కూలి.. (వీడియో)

by Bhoopathi Nagaiah |

సోషల్ మీడియా ఓ వీడియో అందరినీ ఆలోచింపజేస్తుంది. భావితరాలను కలవరానికి గురి చేస్తుంది.

కళ్ల ముందే చెదిరిన గూడు.. ఎన్నో ప్రాణాలకు నీడనిచ్చి నిలువెల్లా కూలి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా ఓ వీడియో అందరినీ ఆలోచింపజేస్తుంది. భావితరాలను కలవరానికి గురి చేస్తుంది. నైంటీస్ కిడ్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తుంది. మనిషి స్వార్ధానికి ఈ వీడియో సజీవ సాక్ష్యం. ‘ఏరు దాటిందాక ఏటి మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య..’ అనే నానుడిని ఈ వీడియో నిజం చేస్తుంది. అందరి మనసులను కలచివేస్తున్న ఈ వీడియోలో ఏం ఉందంటే..

సుమారు 40 ఏళ్ల వయసుకు పైబడిన వృక్షం ఓ రైతు పొలంలో ఉంది. దానిని ఆవాసంగా చేసుకుని పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. ఉడుతలు ఆ చెట్టు పైనే జీవనం ఏర్పాటు చేసుకుని పంటపొలాల్లో దొరికే గింజలను తింటూ జీవిస్తున్నారు. రైతులకు, కూలీలకు ఎన్నో ఏళ్లుగా ఎండ నుంచి నీడను, వర్షంలో తడిసి ముద్దకాకుండా కాపాడిన ఆ చెట్టు నేడు నెలకు ఒరిగింది. దానికి అది నేలమట్టం కాలేదు.. మనిషి స్వార్ధానికి తలెత్తుకుని నిలబడలేక తల వాల్చింది. దానినే నమ్ముకుని జీవిస్తున్న పిచ్చుక వృక్షంతోపాటు కన్నుమూసింది. ఆ పక్షి గూడు చెల్లాచెదరైపోయింది. చెట్టుపై చెంగున ఎగురుతున్న ఉడుత ఈ హఠత్ పరిణామానికి స్పృహ కోల్పోయి పడిపోయింది. రంపం వేటుకు 40 ఏళ్ల చెట్టు విలవిలాడుతూ పొలంలో వాలిపోయింది. ఇక నేటి నుంచి ఆ చెట్టు కనిపించదు. రేపటి నుంచి ఆ వృక్షం ఒక జ్ఞాపకం.. ఎండలో సేద తీరే పశువులు ఇక మరో చెట్టును వెతుక్కోవాల్సిందే..

ఈ చెట్టుకు కొట్టేసింది ఎవరు..? ఎక్కడ? ఏ గ్రామం అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ చలిస్తున్నారు. కళ్ల ముందే మనిషి ప్రాణం పోయినట్టు తల్లడిల్లుతున్నారు. ఇవాళ అక్కడ నేల రాలింది చెట్టు మాత్రమే కాదు.. పక్షులు, జీవరాశులు.. మనిషి నిలువ నీడను కోల్పోయాడు.. అంటూ నెటిజన్లు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Next Story